తాత్కాలిక ఉద్యోగులకు తీపి కబురు
అమరావతి,జూన్11(జనం సాక్షి): ఆంధప్రదేశ్‌లోని 5000 మంది తాత్కాలిక ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. నవంబర్ 25, 1993 ముందు నుంచి ఉండే తాత్కాలిక ఉద్యోగులకు పదవ పీఆర్పీ ప్రకారం జీతభత్యాలు అందించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కాల్వ శ్రీనివాస్ ప్రకటన చేశారు. ఈ సిఫార్సులను కేబినెట్ ఆమోదం కోసం పంపిస్తున్నామని చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై రూ.21కోట్ల భారం పడనుందని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు యనమల, కాల్వ శ్రీనివాసులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగనుంది.