తాలిబన్లు అంటేనే వణుకుతున్న ప్రజలు

దారులన్నీ కాబూల్‌ విమనాశ్రయానికే
ఛాందసవాద పాలనలో బలకలేమంటున్న జనం
కాబూల్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్‌ల నుండి తప్పించుకునేందుకు అక్కడి ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నారు. 20 ఏళ్ల క్రితం నాటి తాలిబన్‌ల పాలనలోని భయానక పరిస్థితులను తలుచుకుని ప్రజలు భయాందోళనలతో దేశం విడిచి పారిపోయేందుకు యత్నిస్తున్నారు. ఆనాడు అధికారం దక్కించుకున్న క్రమంలో నాటి అధ్యక్షుడు డాక్టర్‌ నజీబుల్లాను బహిరంగంగా ఉరితీసారు. ఒకప్పుడు హిందూ సామ్రాజ్యంలో ఉన్నకారణంగా వెలసిన బమియన్‌ బుద్ద విగ్రహాలను తూటాలతో కలూª`చారు. అలాగే దేవాలయాలను ద్వంసం చేసారు. వివిధ దేశాల సహకారంతో గాడిలో పడుతున్న అఫ్గాన్‌ మళ్లీ ముష్కుల చేతికిందకు పోవడంతో ప్రజలు భయంతో పారిపోతున్నారు. కాబూల్‌ విమానాశ్రయం తప్ప మిగిలిన అన్ని సరిహద్దులను మూసివేయడంతో విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించగా, విమానంపై నుండి జారిపడి మరో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. విమానాశ్రయం వెలుపల ఏర్పడిన భారీ ట్రాఫిక్‌ జామ్‌, బారులు తీరిన కారులు, రన్‌వేపై గుమిగూడిన ప్రజలకు సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలను మక్సర్‌ విడుదల చేసింది. అక్కడి ప్రజల దుస్థితికి ఈ చిత్రాలు అద్దం పడుతున్నాయి. ఇకపోతే తాలిబన్ల విజయం వారి పోరాటంగానే చూడాలి. అఫ్గాన్లు పోరాట యోధులు అంత త్వరగా లొంగరు. సాంప్రదాయ ఆయుధాలతోనే నిలువ రించడం వారికి సాధ్యం. పాలనలో, సంస్కరణలలో పక్కన పాకిస్తాన్‌, ఇరాన్‌ రెండు ఇస్లామిస్ట్‌ దేశాల ప్రభావం కొందరు చాందసవాదుల పై ఉండేది. ఆఫ్ఘన్‌ అభివృద్ధి పథంలో నడవటం, రష్యా నీడలో ఉండటం అమెరికాకు నచ్చలేదు. రష్యా బలపరిచిన వ్యక్తి సింహాసం పై అధిష్టించటం జీర్ణించుకోలేదు. మతాన్ని పట్టుకు వేళ్ళాడే ముజాహదీన్‌ లకు కోట్లల్లో చందాలు, ఆయుధాలు అందించడంతో మెల్లగా ముజాహదీన్లు తాలిబన్ల గా రూపాంతరం చెందారు. రష్యా పై కోపం అమెరికా ఇలా తీర్చుకుంది. తాలిబన్లు బలబడటం, సోవియట్‌ విచ్ఛిన్నం కావటం రెండూ ఒకేసారి జరిగాయి. దాదాపు ఇరవై సంవత్సరాల తరువాత అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకుంది. స్వదేశంలో విమర్శలకు తట్టుకోలేక పోయిన అమెరికా ప్రభుత్వం, ఖర్చు, అడపాదడపా తమ సైనికుల మరణాలు. ఇవన్నీ అవసరం లేని తలనొప్పులుగా అనిపించింది. అంతే తాలిబన్లకు చర్చలకు పిలవటం, భవిష్యత్‌లో అమెరికాను ఇబ్బంది పెట్టకూడదన్న షరతులతో సైన్యాన్ని
ఉపసంహరించుకుంది. నిజానికి రష్యా నీడలోనే ఉండి ఉంటే ఈపాటికి అఫ్గాన్‌ ఒక యూరోప్‌ దేశంలా విరాజిల్లేది. పాకిస్తాన్‌, సౌదీల స్వార్థం, అఫ్గాన్‌ ఇస్లామిస్ట్‌ దేశ ల మిగలాలని కోరుకోవడంలో తాలిబన్లు బలపడ్డారు. వారి పాలనలో ఆఫ్ఘన్‌ ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు. 1920లో అక్కడ ఆఫ్ఘన్‌ లో మహిళలకు ఓటు హక్కు, చదువు లాంటివి కల్పించారు. ఇరవై సంవత్సరాల క్రితం తాలిబన్లకు, ఇప్పటి తాలిబన్లకు చాలా తేడా కనిపిస్తోంది. ఆర్థికంగా బాగా బలపడ్డట్లున్నారు. తాలిబన్లకు డబ్బు ప్రపంచ నలుమూలల నుంచి వస్తుంది సానుభూతి పరుల నుంచి, బెదిరింపుల ద్వారా బాగానే డబ్బు గడిరచారు, ఇక అతి పెద్ద మార్గం డ్రగ్స్‌ వ్యాపారం ద్వారా వచ్చేది. మతాన్ని పట్టుకొని వెళ్లాడి, అభివృద్ధిని పక్కన పెడితే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఇప్పటికైనా ఛాందసవాదం వీడి ముందుకు సాగితేనే ఆ దేశం పురోగమిస్తుంది.