తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం.
– ఉత్తమ ఏ డి ఏ ఆవార్డు గ్రహీత తాతారావు కు ఘన సన్మానం.
– సన్మానించిన తాళ్లూరి ట్రస్ట్ చైర్మన్, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత తాళ్లూరి పంచాక్షరయ్య.
బూర్గంపహాడ్ ఆగష్టు31 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం ఇరవెండిలోని పంచాక్షరయ్య నివాసంలో ఉత్తమ ఏ డి ఏ అవార్డు గ్రహీత తాతారావును తాళ్ళూరి చారిటబుల్ ట్రస్టు చైర్మన్, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత తాళ్ళూరి పంచాక్షరయ్య ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించి, శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందింజేశారు. ఈ సందర్భంగా తాళ్ళూరి పంచాక్షరయ్య మాట్లాడుతూ ఉద్యోగులు అంకిత భావముతో నిజాయితీగా పనిచేయాలని, తాతారావు ని మిగిలిన ఉద్యోగులు ఆదర్శంగా తీసుకుని మంచి సేవలను ప్రజలకు అందించాలని, తద్వారా అందరు ఉద్యోగులు దేశ అభివృద్ధి కి పాటుపడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోర్సా లక్ష్మీ, పి ఏ సి ఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు వల్లూరిపల్లి వంశీకృష్ణ, పీఏసీఎస్ సీఈఓ బి.వి.ప్రసాద్, ఏ ఈ ఓ రవితేజ రెడ్డి, ఉత్తమ రైతులు మాడపాటి ప్రకాష్, చేకూరి ప్రసాద్, సత్యనారాయణ, రైతులు పాల్గోన్నారు.