తాసిల్దార్ కార్యాలయం నిర్బంధం *78వ రోజుకు చేరిన విఆర్ఏ ల నిరాహార దీక్ష,
ఖానాపురం అక్టోబర్10జనం సాక్షి
వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గత 78 రోజులుగా తాసిల్దార్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తున్నారు. గత 78 రోజులుగా న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో
రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు సోమవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు సిబ్బందిని లోపలికి వెళ్లకుండా గేటుకు తాళం వేసి నిరాహార దీక్ష చేస్తూ నిర్బంధం చేశారు. వీఆర్ఏలుకార్యాలయాన్ని దిగ్బంధం చేసి అధికారులు కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారు . దీనితో కార్యాలయం పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 78 రోజులుగా విఆర్ఏలు సమ్మెబాట పట్టినప్పటినుంచి రెవెన్యూ పనులు మందకొడిగా సాగుతున్నాయని కార్యాలయానికి వచ్చిన ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వీఆర్ఏలమండల అధ్యక్షుడు బిక్షపతి మాట్లాడుతూవీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రవికుమార్,వీఆర్ఏలు సుధాకర్,గోవర్ధన్,సందీప్,నరసయ్ య,వీరభద్రం,శ్యామ్, శీను, సంధ్య, సుదర్శన్,తదితరులు పాల్గొన్నారు
Attachments area