తిమ్మాపూర్‌ వెంకన్నకు సిఎం పదిలక్షల విరాళం

3174_31ఏడుకొండల వాడి మొక్కులూ చెల్లించుకుంటానని వెల్లడి
నిజామాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి):  నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లో కొలువై ఉన్న వేంకటేశ్వర స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సుదర్శన యాగంలో కేసీఆర్‌ దంపతులు, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తిమ్మాపూర్‌గుట్ట శ్రీవేంకటేశ్వరస్వామిన ఆలయాన్‌ఇన తిరుమల తరహాలో అభివృద్దిచేయాలన్నారు. అందుకు నిధులు కేటాయిస్తానని అన్నారు. తనవంతుగా సిఎం పదిలక్షల విరాళాన్ని ప్రకటించారు.  . బ్ర¬్మత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సుదర్శనయాగంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిమ్మాపూర్‌గుట్ట ఆలయం అద్భుతంగా ఉందని, ఆలయ అభివృద్ధి కోసం పనిచేసిన వారికి అభినందనలు తెలిపారు. ఆలయానికి రూ.10లక్షల 116లు విరాళం ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలో రూ.10కోట్లతో కల్యాణ మండపం కట్టిస్తామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడితే రూ.5కోట్లతో ఆభరణాలు తయారు చేయిస్తానని తిరుమల శ్రీవారికి మొక్కుకున్నాని, త్వరలో శ్రీవారి మొక్కు చెల్లించుకోనున్నట్లు చెప్పారు. దేశంలో దాతృత్వానికి కొదవ లేదని, దాతల సహకారంతో తిమ్మాపూర్‌ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేయనున్నట్లు చెప్పారు.