తిరుమలగిరిలో బతుకమ్మ చీరలు పంచుతున్న సర్పంచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి
బతుకమ్మ చీరల పంపిణీ
తిరుమలగిరి (సాగర్), సెప్టెంబర్ 27 (జనంసాక్షి):
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు దసరా కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలను మండలంలో అన్ని గ్రామాల లో ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి తెలంగాణ ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరలను అందజేసి వారు పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునేలా చూశాడని కొనియాడారు. తిరుమలగిరి, తునికినూతల, గోడుమడక, తిమ్మాయపాలెం, చింతలపాలెం, బట్టు వెంకన్న బావి తండా, నాగార్జున పేట, నెల్లికల్ తదితర గ్రామాలలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు శ్రావణ్ కుమార్ రెడ్డి, పమ్మి జనార్దన్ రెడ్డి, దేవుడు ,మల్లికార్జున్, కార్యదర్శులు కొండల్ రెడ్డి, బురి శ్రీనివాస్, నాయకులు కుర్ర హనుమ, కుర్రదేవ్, రామలింగయ్య, రవి నాయక్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.