తుపాకీ మిస్‌ఫైర్: కానిస్టేబుల్ మృతి
ఆదిలాబాద్: తుపాకీ మిస్‌ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన ఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గంగాధర్ చేతిలోని తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు గంగాధర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.