తెదేపా గెలుపు చారిత్రక అవసరం: చంద్రబాబు

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాంతీయ పార్టీగా అవతరించిన తెదేపా దేశ రాజకీయాల్లోనూ ఉనికి చాటుకుందని అన్నారు. 2009లోనే నగదు బదిలీ గురించి తెదేపా వివరిస్తే దాన్ని కాంగ్రెస్‌ పార్టీ కాపీ కొట్టిందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో  తెదేపా గెలుపు చారిత్రక అవసరమని అన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న మహానాడుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. కేంద్రంలో మూడుసార్లు కాంగ్రెస్సేతర పక్షాలు అధికారంలోకి వచ్చాయంటే తెదేపా చొరవే కారణమని వివరించారు.