తెదేపా రాస్తా రోకో

ఎలిగేడు: విద్యుత్తు కోతలు, హైదరాబాద్‌లో ఎమ్మెల్యేల నిరాహార దీక్షకు సంఘీభావంగా గురువారం ఎలిగేడులో తెదేపా శ్రేణులు ధర్నా, రాస్తారోకో చేశారు. అంబేద్కర్‌ విగ్రహం ముందు గల రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో తెదేపా మండలాధ్యక్షుడు రాజేశ్వరరెడ్డి, నాయకులు శ్రీనివాసరెడ్డి, రాయమల్లు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.