తెమడ పరీక్షలు చేసి క్షయ వ్యాధి పట్ల అవగాహన
జహీరాబాద్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి) జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన సంస్థ వారి ఆధ్వర్యంలో జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన అధికారిని డాక్టర్ రాజేశ్వరి ఆదేశాల మేరకు జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించడం జరిగింది, క్షయ వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి దానిని అరికట్టే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క క్యాంపు ని నిర్వహించడమైనది అని తెలిపారు. బుధవారం,ఝరాసంగం ,రాయికోడు మండలాల గ్రామాలకూ చెందిన 30 మందికి ఛాతి ఎక్స్రే లను ,తెమడ పరీక్షలు చేసి క్షయ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. క్షయ నిర్మూలన ఈ కార్యక్రమంలో అనేక రకమైన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ఎక్స్రేలు తీయించడం ఇందులో భాగమే ఈ కార్యక్రమంలో మిర్జాపూర్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ నాగరాజ్ ,జహీరాబాద్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.