తెరాస నేతల ముందస్తు అరెస్టు

కమాన్‌పుర్‌: తెలంగాణ రాజకీయ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు సడకబంద్‌కు వెళ్లకుండా మండలంలోని తెరాస నాయకులను కమాన్‌పుర్‌ పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల అదుపులో ఉన్నవారిలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకటరమణారెడ్డి, నాయకులు బోరుగు శంకర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, భాస్కర్‌, యాదవ్‌ తదితరులున్నారు.