తెరాస నేతల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడి

కమాన్‌పూర్‌: విద్యుత్‌ కోతలను నిరసిస్తూ కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌ను తెరాస నేతలు ముట్టడించారు. మాజీ జిడ్పిటీసీ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అప్రకటిత కోతలతో రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వెంటనే కోతలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. మండలశాఖ అధ్యక్షులు తిరుపతి, కోకన్వీనర్‌ శంపత్‌ తదితరులు పాల్గొన్నారు.