తెరాస బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు

హైదరాబాద్‌ : నిజాం కళాశాల మైదానంలో తెరాస బహిరంగసభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మైదానమంతా గులాబీమయమైంది. భారీ ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభ ఏర్పాట్లపై నగర నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే నేతలు, కార్యకర్తలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. నిజాం కళాశాల మైదానానికి వెళ్లే మార్గాన్ని స్వాగత తోరణాలతో ముస్తాబు చేశారు.