తెరుచుకుంటున్న పాఠశాలలు

ఎపితో పాటు యూపిలోనూ మోగిన గంటలు
న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో ఒక్కో రాష్ట్రంలో పాటశాలలు తెరుచుకుంటున్నాయి. ఎపిలో పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌లో నాలుగు నెలల అనంతరం తిరిగి పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇకపై 50 శాతం విద్యార్థుల సామర్థ్యంతో ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకు అనుగుణంగా తరగతి గదులను ఏర్పాటు చేశారు. థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌ తరువాతనే విద్యార్థులను స్కూలులోకి అనుమతిస్తున్నారు. లక్నోలో స్కూళ్లకు హోజరవుతున్న విద్యార్థులకు పూలతో స్వాగతం పలికారు. అలాగే విద్యార్థులకు చాక్లెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సోషల్‌ డిస్టెన్స్‌ పాటించేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. ప్రస్తుతానికి 9 నుంచి 12 తరగతుల వరకూ చదివే విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. టీచర్లకు వ్యాక్సినేషన్‌ వేశారు. విద్యార్థులకు ఏం జరిగినా తోణ చర్యలు తీసుకునేలా ఆరోగ్య శృాఖ ను అప్రమత్తం చేశారు. ఇదిలావుంటే పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్‌ పక్రియ పూర్తి చేస్తామని తమిళనాడు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖామంత్రి అన్బిల్‌ మహేష్‌ వెల్లడిరచారు. పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లోనే అనేక మంది ఉపాధ్యాయులు రెండు డోసుల టీకాలు వేయించుకున్నారన్నారు. ఇంకా వ్యాక్సిన్‌ వేయించుకోని ఉపాధ్యా యుల వివరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయం సేకరిస్తోందన్నారు. అందు వల్ల పాఠశాలలను తిరిగి ప్రారంభించడానికి ముందుగానే విద్యాశాఖ సహకారంలో ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామన్నారు. కరోనా కష్టకాలంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్‌ నిర్వహించలేని పరిస్థితి నెలకొందని త్వరలోనే ఈ పక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతామని మంత్రి వెల్లడిరచారు.

తాజావార్తలు