తెలంగాణకు డెడ్‌లైన్లు పెట్టింది కాంగ్రెస్‌ అధిష్ఠానమే

`కోదండరాం
హైదరాబాద్‌ : నేటి నుంచి ఈ నెల 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా చలో అసెంబ్లీ సన్నాహక ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలిపారు. చలో అసెంబ్లీ పోస్టర్‌ను ఐకాస నేతలతో కలిసి ఆయన విడుదల చేశారు. తెలంగాణకు డెడ్‌లైన్లు పెట్టింది కాంగ్రెస్‌ అధిష్ఠానమేనని ఈ సందర్భంగా కోదండరాం అన్నారు.