తెలంగాణకు మరో 45 వేల గృహాలు

1

న్యూఢిల్లీ,డిసెంబర్‌21(జనంసాక్షి): తెలంగాణకు 45 వేల గృహాలను కేంద్ర గృహా నిర్మాణ శాఖ మంజూరు చేసింది. 45 వేలకు పైగా గృహాలకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. అనుమతుల మంజూరుపై త్వరలో కేంద్ర గృహ నిర్మాణ శాఖ అధికారిక ప్రకటన చేయనుంది. అయితే గతంలో రాష్ట్రానికి 10 వేల ఇళ్లను మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మరికొన్ని ఇళ్లు కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది.

ప్రతిపాదన మేరకు ఇళ్ల మంజూరు:దత్తాత్రేయ

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకే కేంద్రం ఇళ్లను మంజూరు చేసిందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. మరో 31 పట్టణాలను అందరికీ ఇళ్ల పథకంలో చేర్చాలని కోరామని తెలిపారు. రాష్ట్రం ప్రతిపాదనలు పంపిస్తే ఆమోదిస్తామని వెంకయ్య చెప్పిన మేరకు రాష్ట్రానికి కేంద్రం 2విడతల్లో 55,507 ఇళ్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. కేంద్ర గృహా నిర్మాణ శాఖ తెలంగాణకు 45 వేల గృహాలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అనుమతుల మంజూరుపై త్వరలో కేంద్ర గృహ నిర్మాణ శాఖ అధికారిక ప్రకటన చేయనుంది. అయితే గతంలో రాష్ట్రానికి 10 వేల ఇళ్లను మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మరికొన్ని ఇళ్లు కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది.  ఇదిలావుంటే కేంద్ర మంత్రి గెహ్లాట్‌తో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం రామన్న విూడియాతో మాట్లాడారు. సమావేశంలో బీసీ సంక్షేమం, ఉపకార వేతనాల పెంపు అంశంపై చర్చించామని తెలిపారు. అటవీ అనుమతులు లేనందున తెలంగాణలో చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లాలో మూతపడిన సిమెంట్‌ పరిశ్రమను తెరిపించాలని గెహ్లాట్‌ను కోరాం. ఇక తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న పరిశ్రమలను తెరిపించాలని విజ్ఞప్తి చేశాం. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరామని పేర్కొన్నారు.  కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ను కూడా కలుస్తామని రామన్న తెలిపారు.