తెలంగాణతో కలిసి పనిచేస్తాం
– బ్రిటీష్ హై కమిషనర్
– ఇండో-బ్రిటీష్ వర్క్‌షాప్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం
హైదరాబాద్,జూన్ 22(జనంసాక్షి):బ్రిటిష్ హైకమిషనర్ బృందం బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిసింది. ఇండో-బ్రిటిష్ వర్క్‌షాప్‌కు మంత్రి కేటీఆర్ రావల్సిందిగా బ్రిటీష్ హైకమిషనర్ డోమినిక్
అస్క్విత్ ఆహ్వానం అందించారు. హైకమిషన్ బృందం టీఎస్ ఐపాస్, ఐటీ, ఇండస్ట్రీ పాలసీలను అభినందించింది. తెలంగాణలో స్మార్ట్ సిటీల నిర్మాణంలో భాగస్వామ్యానికి బ్రిటిష్ బృందం ఆసక్తి చూపించింది.మంత్రి కేటీఆర్‌తో డొమినిక్ వివిధ అంశాల విూద గంటన్నర పాటు చర్చించారు. భారత దేశంలో పెట్టుబడులకి దేశాన్ని ఒక యూనిట్‌గా కాకుండా
రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు, సౌకర్యాలు, పాలసీల అధారంగా చూడాలని మంత్రి కోరారు.తమ ప్రభుత్వానికి ఐటి, ఫార్మ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పెస్ వంటి రంగాలు ప్రాధాన్యత రంగాలన్నారు. ఏరో స్సేస్ రంగంలో పెట్టుబడులకోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నామని తెలిపారు. పెట్టుబడుల కోసం ముందుకు వచ్చే కంపెనీలకు అన్ని విధాలుగా సహకరిస్తామని, ఇక ఐటి రంగంలో తమ రాష్ట్రం పెట్టుబడులకి అకర్షణీయ గమ్యస్ధానంగా మారిందని మంత్రి తెలిపారు.ప్రపంచంలోని టాప్ 4 కంపెనీలు తమ అతిపెద్ద క్యాంపస్‌లను ఇక్కడ నిర్మిస్తున్నాయని హైకమిషన్‌కి మంత్రి తెలిపారు. ఇక బ్రిటన్ లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న స్టెట్ డెస్క్ అలోచనను డోమినిక్
అభినందించారు. దీంతో ఇరు ప్రాంతాల మధ్య మరిన్ని వ్యాపార వాణిజ్య సంబంధాలు పెరుగుతాయన్నారు. ఈ సమావేశంలో మంత్రితోపాటూ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్ ఇతర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.