తెలంగాణను అడ్డుకున్నది సీఎం కిరణే: వివేక్
కరీంనగర్,(జనంసాక్షి): గోదావరిఖని ఎనిమిదవ ఇక్లైన్ కాలనీలో అంబేంద్కర్ విగ్రహాన్ని పెద్దపల్లి ఎంపీ వివేక్, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వివేక్ మాట్లాడుతూ వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డే అని ఆయన తెలిపారు. ప్యాకేజీలు తమకొద్దు తెలంగాణ రాష్ట్రమే కావాలని వివేక్ డిమాండ్ చేశారు. చిన్న రాష్ట్రాలతో అభివృధ్ది సాధ్యమని అంబేద్కర్ చెప్పారని కవిత గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్టించాలని ఆమె డిమాండ్ చేశారు.