తెలంగాణను వంచించిన కెసిఆర్‌

కోదండరామ్‌ సహా అందరినీ కేసులతో వేధించారు

మహిళలు, దళితులను అవమానించారు

చిత్తుగా ఓడించాలని మందకృష్ణ పిలుపు

ఖమ్మం,నవంబర్‌28(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటుకు అమరుల త్యాగఫలం ఎంత ముఖ్యమో.. సోనియా సాహస నిర్ణయం అంతే ముఖ్యం అని మందకృష్ణ మాదిగ అన్నారు. సోనియాకు కృతజ్ఞత చూపడంలో మనం విఫలమయ్యామని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 2014లో చేసిన పొరపాటు.. ఇప్పుడు చేయొద్దని పిలుపునిచ్చారు. మహాకూటమి ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో మందకృష్ణ మాదిగ ప్రసంగించారు. సోనియా, రాహుల్‌కు అండగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాన ఉద్యమకారులను కెసిఆర్‌ వంచించడమే గాకుండా ద్రోహం చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్‌ఇన ముందుండి నడిపిన కోదండరామ్‌ సార్‌ను కూడా నిర్బంధించి కేసులతో వేధించడం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా అన్నారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ లాంటి వారిని కూడా అణచివేతకు బలి చేశారని అన్నారు. అలాగే దళితులకు కేసీఆర్‌ నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ పోరాటానికి అండగా నిలబడింది చంద్రబాబేనని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రివర్గంలో మాదిగలకు కేసీఆర్‌ చోటివ్వలేదని నిప్పులుచెరిగారు. కేసీఆర్‌ మంత్రివర్గంలో మహిళలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఒక్క మహిళకు కూడా కేబినేట్‌లో చోటు కల్పించలేదన్నారు. ఎపిలో మాత్రం చంద్రబాబు ఇద్దరు మ హిళలకు చోటిచ్చారని అన్నారు. అలాగే మాల,మాదిగకలు చోటిచ్చారని అన్నారు. మాదిగలకు చంద్రబాబు న్యాయం చేయడానికి ప్రయత్నం చేశారని అన్నారు. కెసిఆర్‌ తన కుటుంబం కోసం తెలంగాణను వంచిం చారని అన్నారు.

ఆరోగ్యశ్రీ పథకం ఆంధ్రాలో సక్రమంగా అమలు జరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించడం లేదని మందకృష్ణ ఆరోపించారు. వంచనకు మారుపేరుగా నిలిచిన కెసిఆర్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని, మహాకూటమిని బలపర్చాలని మందకృష్ణ పిలుపునిచ్చారు.