తెలంగాణను వంచించే కుట్రలు: టిఆర్‌ఎస్‌

నల్లగొండ,జూన్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఇక్కడి ప్రాజెక్టులకు అడ్డుకుంటే ప్రజలు ఊరుకోరని  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ హెచ్చరించారు. గతంలో విద్యుత్‌ సమస్యల సందర్భంలో ఇలాగే చేసిన బాబు ఇప్పుడు ప్రాజెక్టుల విసయంలోనూ అలాగే చఏస్తున్నారని అన్నారు.  ఇది ఓ రకంగా తెలంగాణ ప్రజలను వంచించడమే అవుతుందన్నారు.  తెలంగాణ ప్రజలను ఇబ్బందులు పెట్టడానికి చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని విమర్శించారు. దీనికి తెలంగాణ టిడిపి నేతలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. గతంలో ఆంధ్ర పాలకులు తెలంగాణలో విద్యుత్తు ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుండా పారిశ్రామికవేత్తలను ఇబ్బందులు పెట్టారని ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ప్రాజెక్టులపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసి తెలంగాణకు అన్యాయం చేసిన వారు ఇప్టపు ప్రాజెక్టులపై కుట్రలు చేయడం విరమించుకోవాలని కోరారు.  ప్రజలకిచ్చిన హావిూలను పక్కన పెట్టేందుకే ఇలాంటి వివాదాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు.  తెలంగాణకు అన్యాయం జరిగిందని గమనించి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా నీటి  వాటాను కేటాయిస్తే ఈ పంచాయితీ ఉండదన్నారు. బచావత్‌ కేటాయింపులపైనా వక్ర భాష్యాలు చెబుతున్నారని అన్నారు.  పోలవరంలో ముంపునకు సంబంధంలేని ఏడు మండలాలను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆంధ్రలో కలిపేందుకు ఆర్డినెన్స్‌ తెచ్చింది చంద్రబాబని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే తమ లక్ష్యమని అన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతికి ఏర్పాటు చేసిన పథకాలు ప్రజల దరికి చేరేలా కార్యకర్తలు చూడాలన్నారు. రుణమాఫీకి, గృహాల నిర్మాణానికి, పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

తాజావార్తలు