తెలంగాణపై అధిష్ఠానం నుంచి సంకేతాలు వచ్చాయి: పాల్వాయి
హైదరాబాద్ : కాంగ్రెస్ సామరస్యపూర్వక వాతావరణం కల్పించే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి అన్నారు. తెలంగాణ ఇస్తున్నట్లు అధిష్టానం నుంచి తనకు సంకేతాలు వచ్చినట్లు చెప్పారు. జులై 5న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని అధిష్ఠానం నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే విషయంపై కాంగ్రెస్ పెద్దల నుంచి స్పష్టమైన హామీ వచ్చిందని వెల్లడిరచారు. మంత్రి పదవి నుంచి డీఎల్‌ను బర్తరఫ్ చేయం దురదృష్టకరమని అన్నారు. సీఎం ఇంతదూరం వెళ్లేందుకు అవకాశం ఇవ్వడంపై అధిష్ఠానాన్ని తప్పుబడుతున్నట్లు చెప్పారు.