తెలంగాణపై టీడీపీకీ స్పష్టత ఉంది: ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణపై టీడీపీకి స్పష్టత ఉందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ఆ పార్టీ నుంచి బహిష్కృతుడైన రఘునందర్ చేసిన ఆరోపణలను ఆ పార్టీ అధ్యక్షడు కెసిఆర్ ఎందుకు ఖండిరచలేదని అడిగారు. టీడీపీలో పార్టీని విలీనం చేస్తామన్నది హరీష్‌రావు వ్యక్తిగత అభిప్రాయమా? అని ప్రశ్నించారు. పార్టీ విలీనంపై హరీష్‌రావు షరతులను కేసిఆర్ ఒప్పుకుంటే అప్పుడు తమ అభిప్రాయం చెబుతున్నామన్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా తమ పార్టీ అధ్యక్షుని అనుమతిమేరకే తాను మాట్లాడుతున్నట్లు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.