తెలంగాణపై తేల్చాకే ఎన్నికలు : వయలార్‌

 

ఢిల్లీ: తెలంగాణపై తేల్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని కేంద్ర మంత్రి వయలార్‌ స్పష్టం చేశారు. తెలంగాణపై నిర్ణయం అధిష్ఠానం బాధ్యత అని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి నష్టం లేదని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీలోకి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. తప్ప ఎక్కువ మంది వెళ్లడం లేదన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మార్పు ఉండొచ్చని చెప్పారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా  దిగ్విజయ్‌ సింగ్‌ను నియమించనున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ లేఖపై వయలార్‌ రవి మాట్లాడుతూ  ఆ లేఖకు సంబంధించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయను అని చెప్పారు. అధిష్టానానికి  అభిప్రాయం తెలిపే అధికారం పార్టీ సీనియర్‌ నేతగా కిషోర్‌ చంద్రదేవ్‌ ఉందన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతగా రాష్ట్ర పరిస్థితులపై లేఖ రాయడంలో తప్పులేదని సమర్ధించారు. ఆయన రాసిన లేఖపై నిర్ణయం అధిష్టానం చూసుకుంటోందని తెలియజేశారు. సీఎం, పీసీసీ చీఫ్‌ మార్పు అంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలే అని స్పష్టం చేశారు.