తెలంగాణపై ప్రకటన షిండేనే చేస్తారు : దిగ్విజయ్
న్యూఢిల్లీ : తెలంగాణపై నెలరోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్‌సింగ్ గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే తెలంగాణపై ప్రకటన కూడా షిండేనే చేస్తారని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ పార్టీ అభిప్రాయాన్ని షిండేకు ఇప్పటికే తెలిపామని స్పష్టం చేశారు.