తెలంగాణపై స్పష్టమైన వైఖరితోనే ఉన్నారు: యనమల

హైదరాబాద్‌ : తెలంగాణ అంశంపై తెలుగుదేశం స్పష్టమైన వైఖరితోనే ఉందని ఆ పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. దీనిపై అనవసర రాజకీయాలు తగవని ఆయన అన్నారు. గండిపేటలోని ఎన్టీఆర్‌ కుటీర్‌లో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను 16 కమిటీల నేతలు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ తెలంగాణ అంశంతో పాటు కళంకిత మంత్రులు తొలగింపు అంశాలు, విలువలతో కూడిన రాజకీయాలపై జరిగే చర్చలో భాగంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను తీర్మానాల రూపేణ చర్చించి ఆమోదించనున్నట్లు చెప్పారు.