తెలంగాణలో అభివృద్థి తెదేపా హయాంలోనే జరిగింది: నామా నాగేశ్వరరావు
ఢిల్లీ: తెలంగాణలో వైద్యం, విద్య సహా అన్ని రంగాలు తెదేపా హయాంలోనే అభివృద్థి చెందాయని ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సవాల్ విసిరారు. సూర్యాపేట సభలో కేసీఆర్ తెదేపాపై చేసిన విమర్శిలను ఆయన తిప్పికొట్టారు. తెలంగాణలో తెదేపాను నమ్ముతారో లేదో కేసీఆర్ ఖమ్మం నుంచి పోటీ చేస్తే తెలుస్తుందని అన్నారు.