తెలంగాణలో కొలువుల జాతర

5

– 15 వేల ఉద్యోగాలకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌ జులై25(జనంసాక్షి):

తెలంగాణలోని నిరుద్యోగులకు తీపి కబురు. 15శాఖల్లో ఖాళీగా ఉన్న 15వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేశారు. ఈ ఏడాది జరిపే నియామకాల కోసం నిరుద్యోగుల వయో పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 34ఏళ్లు ఉన్న వయో పరిమితిని 44 ఏళ్ల వరకు పొడిగించారు. తొలిదశలో వ్యవసాయం, ఉద్యానవనం, ఆరోగ్య, వైద్యం, పురపాలక, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, పోలీస్‌, అగ్నిమాపక, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, స్టాంప్స్‌ అండ్‌ రెవెన్యూ, ఆర్‌ అండ్‌ బీ, రవాణా, జీహెచ్‌ఎంసీ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేసిన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా భర్తీ పక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వయో పరిమితి పెంపును ఈ ఏడాదికి మాత్రమే పరిమితం చేసినట్లు సమాచారం. తుది నియమ, నిబంధనలు త్వరలోనే వెల్లడిస్తారు. పోలీస్‌శాఖలో అత్యధికంగా 8వేలు… విద్యుత్‌శాఖలో 2,681, మిగతా శాఖల్లో 4,300 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రాథమిక సమాచారం.