తెలంగాణలో క్రైం రెటు తగ్గింది

2

– డీజీపీ అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి):గతేడాదితో పోలిస్తే ఈయేడు నేరాల సంఖ్య తగ్గిందని డీజీపీ అనురాగ్‌ శర్మ తెలిపారు. షీటీమ్స్‌ ఏర్పాటు తరవాత మంచి ఫలితాలు వచ్చాయన్నారు. 2015వ సంవత్సరంలో తెలంగాణలో నమోదైన నేరాలపై డీజీపీ అనురాగ్‌ శర్మ బుధవారం విూడియా సమావేశంలో వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే 8 శాతం నేరాలు తగ్గినట్టు ఆయన పేర్కొన్నారు. 92వేల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు. ఈవ్‌టీజర్ల ఆటకట్టేంచేందుకు షీటీమ్స్‌ను రంగంలో దింపడంతో 825 మంది ఈవ్‌టీజర్స్‌ను అరెస్ట్‌ చేశామన్నారు. షీ టీమ్స్‌ బాగా పనిచేశాయని కొనియాడారు. గణాంకాల ప్రకారం చైన్‌ స్నాచింగ్‌లు తగ్గినట్టు తెలిపారు. అంతేకాక రికవరీ శాతం 54.96 గా ఉందని డీజీపీ అనురాగ్‌శర్మ వెల్లడించారు. ఇక ప్రేమ వ్యవహారాల కేసులు అధికమయ్యాయి. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరిగిపోయింది. సైబర్‌క్రైం పెరిగింది. వరకట్న హత్యలు పెరిగాయి. మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ తరుణంలో షీ టీమ్స్‌ బాగా పని చేశాయన్నారు.  825 మంది ఈవ్‌టీజర్స్‌ను అరెస్టు చేశాం. 92 వేల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. ఈ ఏడాది రూ. 88 కోట్ల సొత్తు చోరీ కాగా, రూ. 48 కోట్ల వరకు రికవరీ చేసామని అన్నారు. ప్రజలతో మరిన్ని సత్సంబంధాలకు ఫేస్‌బుక్‌ పేజెస్‌ పెట్టామని వివరించారు.  సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు తీసుకుంటామన్నారు. ¬ంగార్డు నుంచి పైస్థాయి అధికారుల వరకు జవాబుదారీగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.