తెలంగాణలో ప్రవేశించిన షర్మిల
షర్మిల దిష్టిబోమ్మ దగ్ధం : తెరాస నేతల అల్టిమేటమ్
హైదరాబాద్ / మహబూబ్‌నగర్ : తెలంగాణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టం చేసిన తర్వతనే తెలంగాణలో అడుగు పేట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు ఫర్మిలకు అల్టిమేటమ్ ఇచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డికి తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉండేది కాదని, వైయస్ ప్రేమంతా తెలంగాణ భూములపైనే, ఓట్లపైనే అని తెరాస నాయకులు జితేందర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి గురువారం మీడియా ప్రతినిదుల సమాబేశంలో అన్నారు. మాహకుటమీ గెలిస్తే పోతిరెడ్డిపాడును మూసేసి రాయలసీమకు నీళ్లు రాకుండా చేస్తారని అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్నారని వారు గుర్తుచేశారు. తెలంగాణను అడ్డుకున్నది వైయస్ జగన్ కాదా అని అడిగారు… యెగి వేమన విశ్వవిద్యాలయానికి ఇచ్చిన నిధుల్లో 10% నిధులను కూడా తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు వైయస్ రాజశేఖర్ రెడ్డి తన పాలనలో ఇవ్వలేదని వారు విమర్శించారు. పోతిరెడ్డిపాడు నుంచి వైయస్ రాజశేఖర్ రెడ్డి అక్రమంగా నీటిని తీసుకవేళ్లారని విమర్శించారు. తెలంగాణ భూములను దోచుకుంది వైయస్ హయంలోనే అని వారు ఆరోపించారు. వైయస్ మోసంన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరని అన్నారు… రాజన్న రాజ్యం కావాలని పాదయాత్ర చేస్తున్న షర్మిలను తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులు అన్నారు. రహదారిపై షర్మిల దిష్టిబోమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు ధర్నాకు దిగారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.