తెలంగాణలో మరో కొత్త మండలం.. ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సోనాలా మండలం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. పది గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ మేరకు సోనాలా మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.