తెలంగాణలో రాహుల్ పర్యటన ఖరారు
హైదరాబాద్, ఆగస్టు, 7: తెలంగాణలో రాహుల్ పర్యటన ఖరారయ్యింది. 27న ఓయూలో విద్యార్థి ఆత్మగౌరవ సభ జరగనుంది. ఈకార్యక్రమంలో రాహుల్‌గాంధీ పాల్గొననున్నారు. అదేవిదంగా 28న వరంగల్, భూపాలపల్లిలో రాహుల్ పర్యటన జరగనుంది. అనంతరం సింగరేణి కార్మికులతో రాహుల్ ముఖాముఖి కార్యక్రమం జరుగుతుంది. ఇదిలా ఉండగా ఢిల్లీలో సా.5 గంటలకు ఉత్తమ్, సంపత్, ఓయూ విద్యార్థి నేతలు రాహుల్‌తో భేటీకానున్నారు. ఓయూకు రాహుల్‌ను ఆహ్వానించాలనే ఉద్దేశ్యంతో నే ఈ భేటీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రాహుల్ తెలంగాణలో పర్యటించినపుడు అనూహ్యస్పందన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు.