తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం ముమ్మాటికీ కాంగ్రెస్ దే-ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డా. రామచంద్రు నాయక్
బయ్యారం, సెప్టెంబర్ 21(జనంసాక్షి):
బుధవారం బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డా. రామచంద్రు నాయక్ అధ్యర్యంలో విలేకరుల సమావేశం జరిగింది.ఈ సమావేశాన్ని ఉద్దేశించి రామచంద్రునాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో రాబోయే 2023 న అధికారం రావడం జీవించుకోలేక దేశంలో బిజెపి, రాష్ట్రం లో తెరాస పార్టీలు మైండ్ గేమ్ ఆడుతూ రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురిచేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నాయని అన్నారు.సెప్టెంబర్ 17 న బీజేపీ పార్టీ తెలంగాణ విమోచన దినం పేరుతో,తెరాస జాతీయసమైక్యత దినోత్సవం పేరుతో ప్రజల్లో తమ ఉనికి కోసం రాజకీయ వ్యభిచారానికి పాలపడ్డాయని, 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ భారత దేశంలో విలీనం అవడానికి, వేల మంది త్యాగాల ఫలితంగా స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ వాదుల త్యాగం మరువలేనిదని,ప్రధానమంత్రి నెహ్రు, హోమ్ మంత్రి సర్ధార్ వళ్ళబాయ్ పటేల్ వల్ల తెలంగాణ నిజాం నవాబుల నిరంకుశ పాలన నుండి తెలంగాణ కు విముక్తి కలిగిందని,1948 లో బీజేపీ పార్టీ స్థాపించ బడిందా? తెరాస పార్టీ పురుడు పోసుకుందా? రాజకీయ పబ్బం కోసం ప్రజల్ని అయోమయంలో పడేసి లబ్ది పొందాలని చూస్తున్నాయని, మేధావులు, విద్యార్థులు,ప్రజలు, మతతత్వ బీజేపీ వాదుల పట్ల,అవినీతి తెరాస పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తం గా వుండి ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీని అదరించాలని కోరారు.ఈ కార్యక్రమం లో బయ్యారం మండల అధ్యక్షులు కంబాల ముసలయ్య, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని శ్రీనివాసరెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి గట్ల గణేష్, గడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు.