తెలంగాణలో వాడుతున్న కమలం రెక్కలు..  

 

 

 

 

 

 


కొన్ని నియోజకవర్గలకే పరిమితం కానున్న భాజపా.

ఇంటలిజెన్స్ రిపోర్టు తోని “బండి” తొలగింపు..

ఈటెల కోమటిరెడ్డి బెదిరింపులతో దిగివచ్చిన కేంద్రం.

చంద్రశేఖర్ బాటలో మరికొందరు.

బా రా స లోకి రఘునందన్ కు గ్రీన్ సిగ్నల్..,?

కర్ణాటక ఓటమితో తగ్గిన బాజపా

జనంసాక్షి. కర్ణాటక ఎన్నికల ప్రభావంతో. రాజకీయంగా సమీకరణలు నిశ్శబ్దంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. పట్టుకోసం పార్టీల వ్యూహాత్మక ఎత్తుగడలు కొత్త పరిణామాలు తెరపైకి తెస్తున్నాయి. భారతీయ జనతా పార్టీలో పెను తుఫాను సృష్టించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా బండి తొలగింపు పై కేంద్రానికి ఇంటలిజెన్స్ అందించిన సమాచారం కారణమన్న చర్చ నడుస్తోంది. బండి తొలగింపు నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో డీలపడింది.

ప్రస్తుతం రాష్ట్రంలోచోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలకే భారతీయ జనతా పార్టీ పరిమితం కావచ్చు అన్న నిర్ణయానికి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకత్వం భావించినట్లు తెలుస్తున్నది. ఒకేసారిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో వెనక్కి తగ్గడం భారత రాష్ట్ర సమితికి ఒకరకంగా భారమే అయి ఉండే అవకాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న అనంతరం బిజెపి కేంద్ర నాయకత్వం తిరిగి పోయిన ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్న లలో భాగంగానే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తో పాటు చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్, ఎంపీ బండి సంజయ్ లను ప్రచారంలోకి దించింది.

ముగ్గురు నేతలు కలిసి కట్టుగా ఎన్నికల వ్యూహం చేసేలా చూడనుంది. బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన కేంద్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇటీవల పార్లమెంటులో బండి సంజయ్ తో మాట్లాడించడం కూడా వ్యూహంలో భాగమై ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

ఎన్ని ప్రయోగాలు చేసిన పార్టీకి పూర్వ వైభవం రావడం కష్టమన్న అభిప్రాయం కిందిస్థాయి కార్యకర్తల్లో ప్రబలంగా కనిపిస్తుందనీ భావించిన పలువురు నేతలు పార్టీని వీడనున్నారన్న ప్రచారం జరుగుతుంది. పార్టీ నాయకులు మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీని విడనున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొత్తగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత కొత్తగా జయసుధ తప్ప ఎవరు చేరకపోవడం తో పలువురు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే రఘునందన్ రావు భారత రాష్ట్ర సమితిలోకి చేరేందుకు ఆ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తుంది.