తెలంగాణా ప్రయోజనాలు మహారాష్ట్రకు తాకట్టు : టిడిపి
ఆదిలాబాద్,ఏప్రిల్ 2(జనంసాక్షి): తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కడమే కాక మహారాష్ట్రకు తాకట్టు పెట్టిన వైనంపై తెలంగాణా జాతి ఏనాడు కూడా కేసీఆర్‌ను క్షమించబోదని జిల్లా టిడిపి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. గోదావరి జలాలను ఈ నూతన ప్రాజెక్టుతో కేవలం మెదక్ జిల్లాకు తరలించుకుపోవడమే ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని తెలిపింది. ప్రతి చుక్క నీరు కూడా స్థానికంగా వినియోగించుకున్నాకే ఇతర జిల్లాలకు చెందేలా ప్రజల్లో చైతన్యం కల్పించి పోరాటం చేస్తుందని హెచ్చరించారు. మహా ఒప్పందాలన్నీ కూడా బూటకమేనని ఆయన వేసుకున్న ఇంజనీర్ల కమిటీల నివేదికలే స్పష్టంగా చెప్తున్నాయని మాజీ మంత్రి, టిడిపి నేత బోడ జనార్ధన్, మాజీ ఎంపి రాథోడ్ రమేశ్‌లు వేర్వేరుగా అన్నారు. తెలంగాణాలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రయోజనాలను తుంగలో తొక్కి తన స్వంత జిల్లా మెదక్‌కు నీటిని దొంగిలించుకుపోవడమే ప్రధాన కారణంగా పనులు సాగుతున్నాయన్నారు. తప్పులను ఒప్పులుగా చేసి చూపేందుకు అసెంబ్లీని వేదిక చేసుకున్నారని మండిపడ్డారు. స్పీకర్‌కు సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ప్రతిపక్షంగా తమకు అదే అవకాశాన్ని కల్పించాలని కోరినా ఎలంటి అనుమతివ్వకుండా స్పీకర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఎలాంటి జాతీయ ¬దాను దక్కకుండా కేసీఆర్ చేజేతులా చేసుకున్నారని, ప్రాణహితకు ఆ అవకాశం ఉన్నా దానిని కావాలనే తుంగలో తొక్కారన్నారు. కేసీఆర్ నియమించుకున్న నలుగురు చీఫ్ ఇంజనీర్ల బృందం మేడిగడ్డ ఎట్టిపరిస్థితిలో నూ అనుకూలం కాదని నివేదిక ఇచ్చింది వాస్తవం కాదా అని ఆనివేదికను చూపిస్తూ ప్రశ్నించారు. తెలంగాణా ప్రయోజనాలను ఇతరులకు తాకట్టు పెట్టడమే ప్రధాన కర్తవ్యంగా కేసీఆర్ పాలన సాగుతుందన్నారు. పోలవరం విషయంలో ఏకంగా ఏడు మండలాలను కేసీఆర్‌కు సోయికూడా లేకుండానే కేంద్రం ఏపిలో విలీనం చేసిందన్నారు. అక్కడ కూడా నీరంతా ఆంద్రప్రదేశ్‌కు పోతుందన్నారు. అక్కడ ఓరిస్సా తీవ్ర అభ్యంతరం చెపుతున్నా కూడా కేంద్రం దానికి జాతీయ ¬దానిచ్చి ఒరిస్సాను నోరు మూయించిందని అదే పనిని తెలంగాణాలో ప్రాణహిత-చేవెళ్ల వద్ద నిర్మించేందుకు కేసీఆర్ ఎందుకు కేంద్రంపై ఒత్తిడి చేయలేదన్నారు. తుమ్మడిహెట్టి వద్ద 3వేల ఎకరాల ముంపును నివారించేలా కరకట్టలు నిర్మించే అవకాశంఉందా లేదాని వారు కేసీఆర్‌ను ప్రశ్నించారు. ప్రాణహిత వల్ల 80 కిలోవిూటర్లు కాలువల ద్వారా మరో 20 కివిూ మాత్రమే ఎత్తిపోతలు అవసరం అన్నది కూడా వాస్తవం కాదా అన్నారు. అన్ని వాస్తవాలను తుంగలో తొక్కి కేవలం తాను తందానా అంటే మిగతా వారంతా తందానా అనాలనుకోవడం కేసీఆర్ మూర్కత్వానికి నిదర్శనమన్నారు. పోగా గోదావరి జలాలను ఈ మూడేళ్లో ఎట్టి పరిస్థితిలోనూ తాను తీసుకురాలేనని మరోసారి ప్రజలు అధికారం కట్టపెడితేనే పూర్తి చేస్తానని చెప్పడం ప్రజలను మభ్యపె ట్టడం కాదా ఆన్నారు. తుమ్మిడిహెట్టినుంచి మేడిగడ్డ వరకు 100నుంచి 120 కిలోవిూటర్ల దూరం గోదావరి ప్రవాహంలో మహారాష్ట్ర ఇంటె క్‌వెల్‌ల నిర్మించి నీటిని దోచుకునే అవకాశాలు కూడా త్వరలో మనం చూడపోతున్నామన్నారు. ఇప్పటికే గోదావరి నదిపై బాబ్లీ సహా పదుల సంఖ్యలో రిజర్వాయర్లు నిర్మించుకుని నీటిని రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అదే పనిని రేపు కూడా ఈ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ మద్యలో చేయపోతుందని, దీంతో మేడిగడ్డలో కూడా నీటి లభ్యతలేకుండా కేసీఆర్ తెలంగాణాకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్లకు ఇప్పటికే 11 లో ఆరు అనుమతులు వచ్చాయని, ప్రదానంగా కేంద్ర జలసంఘం అనుమతి ఉందని, దీనిని త్వరలోనే జాతీయ
¬దా లభించేదని అలా కాకుండా కాళేశ్వరంతో ఏ ప్రయోజనాలు తెలంగాణకు చేకూరబోవన్నారు.