తెలంగాణ అంతటా రుతుపవనాలు

హైదరాబాద్‌: కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణతో పాటు మిగిలిన ప్రాంతాల్లోను రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వారు పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో తెలంగాణ ప్రాంతం అంతా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నట్లు వెల్లడించారు. అల్పపీడనం కారణంగా కోస్తాంధ్రలో కూడా అంతటా రుతుపవనాలు విస్తరించాయని అన్నారు.