తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 10th

దళిత తిరుగుబాటు దారులే ముస్లింలు
నిజానికి సమ్మతి అనేదానికంటే విధిలేని అంగీ కారమంటే బాగుంటుందేమో. తరాల తరబడి జరి గిన అణచివేతను ఒక ‘ఫొర్సు’ వుధృతిని తట్టు కోలేక జరిగిన అంగీకారం సాహిత్యంలో దళితు లు, స్త్రీలు స్థానంగా మిగుల్చుకున్నారు. స్త్రీలను, దళితుల్ని అణచివుంచే తాత్వికత కలిగిన హిందూ ఆధిపత్య కులాల ఉక్కు పిడికిట్లో వున్న సాహి త్యానికి దాని ధోరణులకు వ్యతిరేకంగా స్త్రీలు, దళి తులు వూపిరాడకుండా తీసుకోచ్చిన ఫోర్సు వల్లనే యీ పీఠాల, సంస్థాన సాహిత్యంలో స్థానాలేర్పర్చు కున్నారు. యీ స్థానం వాళ్లకి అయాచితంగా వచ్చింది కాదు.
భారత ముస్లింలు కూడా కుల సమాజాన్ని ఎదిరించి, వ్యతిరేకించి బయట పడిన దళితులే యీ పునాదులను విస్మరించకుండా ఆ తాత్వికత ను ప్రశ్నించే దిశగా ఎదుగుతూ ఫోర్సుగా ఉద్యమ రూపాన్ని సంతరించుకోని తెలుగు సాహిత్యంలోకి రావాల్సిన అవసరముంది. ఇప్పటికే ముస్లిం సాహిత్యం ప్రదర్శించిన వైవిధ్య చైతన్యం ఏ సాహి త్యానికి తీసిపోదు అనేది వాస్తవం.
కుల సమాజంలో ఏ కోణమూ కులానికతీతం కాదు. అంటే చైతన్యానికి కూడా కులముంది. అ ట్లా యిక్కడి అధిపత్య కులాలకు సంబందించిన వాళ్లలోనే చాలావరకు హిందూత్వాన్ని చంపుకోని తనం కనిపిస్తుంది. హిందూ మతం ద్వారా వచ్చి న అగ్రవర్ణ సౌకర్యాలను వేలయేళ్లుగా అనుభవిస్తు న్నవారు. సామాజిక చైతన్య క్రమంలో ఎదుగుతు న్నా యింకా వాసనల్ని వదిలించుకొని బలహీనత లోనే వున్నారంటే కారణంగా హిందూమతం అగ్ర వర్ణాలకు కల్పించిన కంఫర్ట్స్‌ను వదులుకోలేకనే.
నిజానికి గుజరాత్‌లో ముస్లింల వూచకోత అధాటుగా అవేశంగా జరిగింది కాదు. యిది అక్క డి బిజెపి దాని అనుబంధ మతసంస్థలు, ప్రభు త్వం మెలకువగా పద్ధతిగా ప్లాను వేసిన వూచకోత దీన్ని ప్రభుత్వమే ‘హిందువుల సహజ స్పందన’ అని చెప్పడం వెనక ఏయే ఉద్దేశాలున్నవో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గుజరాత్‌లోని ముస్లింవ ర్గం దేశంలోనే ఆర్థికంగా పరిపుష్టమైన దిశగా ఎదుగుతున్న క్రమాన్ని జీర్ణించుకోలేని హిందూ మతం ప్రత్యేక సౌకర్యాలు, ప్రాధాన్యతల్ని పౌర హ క్కులడక్కుండా వినయ విధేయతతో మెలగాలనే గోల్వాల్కర్‌ అప్రజాస్వామిక హిందుత్వవాదానికి పరాకాష్టనే యీ గుజరాత్‌ వూచకోత. భారత సంస్కృతంటే హిందూ సంస్కృతని హిందూ సంస్కృతి ఆవలనున్న దళిత గిరిజన సంస్కృతు ల్లాగనే మైనారిటీ సంస్కృతుల్ని కూడా విదేశీ బూ చితో అణచివేసిన దుర్మార్గమే గుజరాత్‌..
ఒక సమూహపు ఐడెంటిటీని సోంత ప్రయో జనాలకు మాత్రమే ముందుకు తెచ్చి అదే సామా జిక సమస్యగా చేసిన సంస్థలు, వ్యక్తులు, వారి సంస్కరణల అనుభవాలను చూస్తే మనకోక విష యం అర్థం కావాలి. ఎవరి వర్ణ, వర్గ సమస్యల్ని వాళ్లు పరిష్కరించుకోడానికే సంస్కరణలు, పోరా టాలు, ఉద్యమాలు నడిపిండ్రు. చలం, గురజాడ వీళ్లంతా వాళ్ల వర్ణంలోని పేదవాళ్ల గూర్చి వాళ్ల బ్ర హ్మణ సంస్కృతిలో నలుగుతున్న స్త్రీల అణచి వేత ను మొత్తం సమాజ సమస్యగా, సంస్కరణగా విస్త రింపజేశారు ప్రధాన స్రవంతిలో కుల సమస్య వేరే కింది కులాల మతాల స్త్రీల సమస్యలు వాళ్ల కు ఆనలేదు.
కుల సమస్యను పొగొట్టడానికి కుల పీడితుల్నిం చే పూలే, అంబేడ్కర్‌ భారత దేశ మూలతత్వాన్ని పెకిలించి దళిత బహుజన కుల చైతన్యం కలిగిం చారు.
హిందూవాదులు, వాళ్ల సంస్థలు ముస్లింలను వేరే మతంగా కాకుండా ‘వేరే జాతి’గా చూసే క్ర మాన్ని వెదజల్లుతున్నారు. దీన్ని దెబ్బకొట్టేం దుకు భారత ముస్లింలు యీ దేశ కుల వ్యవస్థను ధిక్క రించి ముస్లింలుగా స్థిరపడ్డ దళితులనే తాత్వి క వాస్తవాన్ని ఎక్కుపెడుతూ ఆ పునాదుల తాత్వి కత ను ప్రశ్నించే దిశగా ఎదగాల్సిన అవసరముం ది. ఆ వైపుగా ఉద్యమాలు నిర్మించి ముస్లింలను ‘విదే శి బూచితో వేరు చేస్తున్న’ హిందూత్వాన్ని తిప్పి కొట్టాలి. దానికి వేరే సంస్థలు, వ్యక్తులు పూనుకో వు. అట్లా పూనుకోవడం వల్ల సమస్య పరిష్కారం గాక కొత్త అవతారాలెత్తడం చారిత్రకం గా చాలా చూశాం. అయినా వేరే వాళ్ల కోసం ఎ దురుచూ డ్డం యీనాటికి కూడా సరైన ధోరణి కాదేమో.
గుజరాత్‌లో స్త్రీలపై జరిగిన అత్యాచారాలకు మీరెలా ఫిలయ్యారు?
జవాబు:సమాజంలో వివిధ వర్ణాలు, వర్గాలు వాటి ప్రయోజనాలు ఘర్షించినపుడు ఎక్కువ ఆధిపత్య వర్ణాల మగవాళ్లే కిందికులాల లేదా మతాల స్త్రీల ను మాత్రమే ఎంచుకుని అత్యాచారాలకు పాల్పడి న ఘటనల నేపథ్యాల్నించే యీ గుజరాత్‌ స్త్రీల అత్యాచారాలు చూడాలి. అత్యాచారమంటే స్త్రీల మీద పాశవికంగా అమానుషంగా పురుషులు త మ ఆధిపత్యాన్ని సాగించుకునే చర్య. ఇది ఎక్కువ గా కిందికులాల, మతాల స్త్రీలపైనే జరగడం ఎందుకో గమనించాలి. హింసాచర్యలతో కొన సాగే పితృస్వామ్య అణచివేత సాధనంగా యీ అ త్యాచారాలు స్త్రీల మీద జరిగే క్రమమే గుజరాత్‌ ముస్లిం స్త్రీలమీద జరిగింది. స్త్రీల మీద అత్యాచా రాలనేవి పురుషాధిపత్య స్థాపనతోపాటు స్త్రీల లైంగికత్వం పైనే కాక వారి కులమతాల సాంఘిక కంట్రోలును కూడా చేతిలోకి తీసుకునే క్రమంతో నే గుజరాత్‌ ముస్లిం స్త్రీలపై హిందూ మత పురు షాధిపత్యంతో లైంగిక దాడులు చేయడంవల్ల వారి మతాల సాంఘిక కంట్రోలును సాధించుకున్నా మన్న దుర్మార్గం అక్కడ నేరవేరించుకున్నది..
-జె. సుభద్ర
అది హిందుత్వ చైతన్యమే
తిసమాజంలో ముస్లింలకు ‘సమ్మతి ‘ లేనట్లే వారి సాహిత్యానిక్కూడా ‘సమ్మతి’ లేదు.
తి ‘చైతన్యవంతులైన ‘ వారి హిందుత్వ చైతన్య మే.వారి జాతీయత హిందుత్వ జాతీయత. వారి సెక్యులరిజం.మార్కిృజం హిందూత్వ మార్కిజం వాదుల్లో కోందరు ఉగ్రవాద హిందూత్వవాదులు మరికొరదరు ఉదారావాద హిందూత్వవాదులు. మరికోందరు అధునాతన హిందూత్వవాదులు .ఈ ‘హిపొక్రసీ ‘కి వ్యతిరేకంగా సాంస్కృతిక పొరా టం నిర్వహించాలి.
తి అది ప్రతిఘటిసున్న ముస్లింలపై హిందూత్వ పగ.అది పిరికితనం.
తి సంస్థలు లేకపోయిన వ్యక్తులున్నారు. ముస్లిం వ్యతిరేకను పొగట్టే ఒక సంస్థను , ఒక ఉద్యమా న్ని మనం ప్రారంభించాలి. ముస్లిం – దళిత ఐక్య త దానికి ఇరుసు కావాలి.
-శివసాగర్‌
ఉద్యమకవిత్వంలో ముస్లింలది
ప్రత్యేక శిల్పం
సమాజంమారుతొంది.విలువలూమారుతున్నాయి.దాంతో వ్యష్టి అనుభవాలను సమిష్టీకరించడం వ్య ష్టి అనుభవాలకే పరిమితమవడం వంటి ప్రాతిపది కలకి కాలం చెల్లింది. ఈ సాధారణీకరణాన్ని ఎ ప్పుడూతే నిరాకరించారొ – కవిత్వపరంగా యింతకు ముందున్న పరిమితులు తొలుగుపొయా యి. పరిమితుల్ని నిరాకరించడం ద్వారా వస్తుగ తంగా మనిషి లొపల కలిగే భావ సంచలనాలు కవిత్వంలొ రూపం పొందాయి.అనుభూతుల్ని తన అనుభూతలుగానే తన భాష లొనే వ్యక్తం చేయ డం మొదలైంది.ఫలితంగా కవి ఏ అనుభవాన్నైనా వ్యక్తీకరించవచ్చు .కాకపొతే అనుభవానికి సంభం దించిన అన్ని పార్శ్వాలు వ్యక్తీకరణ పొందాలి అనుభవానికున్న విస్తృతమైన సామాజిక ప్రాతి పదికని కవి విస్మరించకూడదు. వ్యక్తి అనుభవం సామూహిక అనుభవంగా విస్తృతమవడమే కాకుం డా అనుభంలో నిజాయితీ వుండాలి. సమాజమైన జీవననుభవాలు కవితా వస్తువు కావాలి.అస్పుడే కవిత్వానికొక నిజాయితీ సిధ్దిస్తుంది. ఇటువంటి వైవిధ్యమైన మార్పు ఉద్యమ కవిత్వంలో బలపడిం ది. ఈ భావన మరింత బలంగా ముస్లిం మైనా రీటీ కవిత్వంలో తేటతెల్లమైంది.
ముస్లిం కవితా ఉద్యమం గోప్ప సామాజిక అవస రం నుంచి పుట్టింది.ఆ వేదనతో కూడిన ఆవేశం దీనికి తొడయింది.
కవితా వస్తువు నూహించటానికి యిది పునాది ఏర్పరిచింది. కూడిన ఆవేశం దీనికి తొడయింది. ఎప్పుడైతే వస్తువు ఏర్పడి నిర్మాణం కౌశలం ఆరం భమైందో అప్పుడే కవితా శిల్పం రూపు దిద్దుకొం ది. ఈ శిల్పంలో భాష, భావప్రతిమలు,సంప్రదా యచిహ్నాలు,ప్రతీకలు, పదచిత్రాలు వస్తువుకు అ నుగుణంగా శిల్పంతత్వం పొందాయి. పైగా ము స్లింలలోని పదజాలం ఈ శిల్పానికి కొత్త నగిషిని చేకూర్చింది. అంతేకాక కవి మనో ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి అనుసంధానం కుదిరే శిల్పం ముస్లిం కవిత్వానికి సాధ్యపడింది. మచ్చుకు-న న్నొ అస్పృశ్యను చేసి బుర్ఖాలొ దాచేస్తే
నా ‘గుల్పొషి’ తొడిగిన పూనవ్వులకీ
నా కలల ‘చాందినీ’కి
ఏ పవిత్ర గ్రంథం ప్రాణం పొస్తుంది?…
ఎత్తి చూశావా ఎన్నడైనా ?(హిజాబ్‌ -స్కైబాబ )
( ఇట్లా ఎన్నొ ముస్లిం కవితల్ని ఉదాహారణలుగా చూపవచ్చు)
-వేముల ఎల్లయ్య,స్కైబాబ
ఇంకావుంది…