తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

సమాజస్థితిని వివరించడానికి విమర్శించడా నికి మెరుగుపరచడానికి అవసరమయ్యే పదజా లం అందరినీ చేరేముందే ప్రగతి శీలవాదులలో సాహిత్యకారులలో చెలామణిలోకి రావడం మా మూలే, కానీ, దళిత వ్యతిరేకతా , కోస్తా దురహం కారం లాగా మైనారిటీ వ్యతిరేకత, ముస్లిం వ్యతిరే కత లాంటి పదాలు మన సాహిత్య ప్రగతిశీల వర్గాల్లో ఇంకా వాడుకలోకి రాలేదు. మన సాహి త్యకారుల్లో ఎవరిమీదనయినా స్త్రీ వ్యతిరేకిననో దళిత వ్యతిరేకివనో ముద్రవేస్తే ముద్రపడినవాళ్లు తమలో అలాంటి వ్యతిరేకత లేదని రుజువు చేసు కునేందుకు చేయగలిగినంతా చేస్తారు. ఆత్మవి మర్శ చేసుకుంటారు. కానీ ఇప్పటిదాకా మన సా హిత్యలోకంలో ఎవరిమీదా ముస్లిం వ్యతిరేకి అనే ఆరోపణే రాలేదు. ఏ ఒక్కరిలోనూ లేని చెడును గురించిగానీఅందరిలోనూఉమ్మడిగా ఉన్న చెడును గురించి గానీ మాత్రమే విమర్శలు రావు. రచయి తలకి మేధావులకి కులమత ప్రాంత భేదాలేమిటని అమాయకంగా ప్రశ్నించే దశని దాటి మనం వచ్చి చాలా కాలమయింది. కానీ ముస్లిం వ్యతిరేకత గురించి ఎవరూ ఎందుకు మాట్లడరు? మన సాహిత్యలోకాన్ని మొత్తంగానే ముస్లిం వ్యతిరేకత పట్టిపీడించుతూ ఉండటమే దీనికి కారణం. అంద రిలోనూ ఉండి ఏ ఒక్కరూ ఒప్పుకోవడానికి సిద్దం గా లేనపుడు ముస్లిం వ్యతిరేకత అనే భావన చెలా మణిలో లేకపోవడం, తమ సాహిత్య ఆచరణలో నూ ప్రగతిశీల బృందాల జీవిత శైలిలోనూ తమని పొలిటికల్లీ కరెక్ట్‌గా ఉండే ప్రయత్నాలయినా లేక పోవడం సహజమే. శాస్త్రిగారూ మీకూ ఇంగ్లీషు అంతబాగా ఎలావచ్చూ అని ఎవరూ అడగరు. హిందువుకి ఏ భాష అయినా రావచ్చు. సహజ మనే అనుకుంటారు. ముస్లిం కవుల్ని మాత్రం మీకు తెలుగు బాగా రావడానికి కారణం ఏమిటి? అని అడగడం మాత్రం మతతత్వం కాదన్నట్టే ప్రవర్తిస్తారు. దళితులూ స్త్రీ వాదులూ తెలంగాణా వాదులూ వెనుకబడిన కులాలవారూ ఎన్నో ప్రశ్న లు తమ ఇష్టం వచ్చిన పద్ధతిలో అడిగితే విప్లవకా రులూ అభ్యుదయవాదులూ ఓపికలగా సమాధా నాలు ఇస్తారు. ఖాదర్‌ మొహియుద్దీన్‌ అంతటి వాడు సాహిత్య చరిత్రలో ముస్లింల పట్ల వివక్ష గురించి రాస్తే ఆ పత్రిక వాళ్లు చర్చను ఆహ్వానిం చినా సరే ఎవరూ స్పందించలేదు. ఏ వాదం వాళ్ల యినా తమ బాధ గురించే పట్టించుకుంటామనీ ఎవరి విముక్తిని వారే సాధించుకోవాలని వాదించ గలరు. కానీ ముస్లింలు మాత్రం స్వతంత్రంగా ఏ మన్నా చేయాలనుకుంటే ఆది వేర్పాటువాదంగా తప్ప మరోలా చూడలేరు. ముస్లిం రచయితలు తా ము మతతత్వవాదులంకామనీ వ్యతిరేకమని ప్రతి కదలికలోనూ కనిపించేలా చేసుకోవాలి. హిందూ సాహిత్యకారుడూ ఎలుగెత్తి చాటుకోవాల్సిన అవ సరం ఉండదు. వెనుకబడిన కులాల కవుల ‘వెం టాడే కలాలు’ సంకలనంలో వెనుకబడిన కులాల ముస్లింలని వెలివేయడం గరించీ, 92 డిసెంబర్‌ 6 తర్వాత కూడా కొందరు మార్కిస్టు మిత్రులు సైతం ఆరెస్సెస్‌ వ్యక్తులతో సాహిత్యాన్ని పంచుకో వడం గురించీ, చేతగానీ వర్తమానం ఇప్పుడు నోరుమూసుకున్నా భవిష్యత్తు తన తీర్పుని ఇవ్వక మానదు. అగ్రవర్ణ మార్క్సిజం అని దళితవాదులు చేసిన వ్యాఖ్యాని హిందూ మార్క్సిజమని సంరించు కోవాల్సిన సమయం వచ్చేసింది.

-యూకుబ్‌

ముస్లిం సంస్థల కార్యక్రమాలు విశాల రాశులకు విస్తరించాలి

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ దళిత రచ యిత ఓంప్రకాష్‌ ఆత్మకథ ఇంగ్లీషు అనువాదం ‘ఎంగిలి మెతుకులు తినేవాడు’ ఈ మధ్యే విడుద లైంది. ఈ రచన రామాయణకర్త వాల్మికి వారసు లని భావించుకొనే భంగీ కుల దుర్భల జీవితాన్ని చిత్రిస్తుంది. వాల్మీకి అనే ఇంటిపేరు బంగీ కుల జీవితాన్ని సూచిస్తుంది.ఓం ప్రకాశ్‌ తన బాల్యంలో అగ్రకుల భూస్వాముల పళ్లెంలో మిగిలిన ఎంగిలి మెతుకులు తిని గడిపిన రోజుల్ని గుర్తు అయినప్ప టికి అతని తండ్రికి హిందువులనని గర్వంగా ప్రకటించుకోవాలనీ కళ ఉండేది.ఎప్పుడూతే ఓం ప్రకాష్‌ చదువగలడని తండ్రి గర్తించాడో అప్పుడు తన సంపదలోంచి భగవత్‌గీతను కొని తెచ్చాడు. అది చదివి వినిపిస్తుంటే తన తండ్రి అనందించే వాడు. కానీ ఓం ప్రకాష్‌కి అంటరానితనం గురిం చి భగవత్‌గీత ఎలాంటి పరిష్కారాన్ని చూపించేది కాదు. ఓం ప్రకాష్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా మొదటి వేతనం తీసుకోనేంతవరకు మంచి ఆహా రం, గౌరవం, సమానత్వం అంటే ఏమిటో తెలియ దు. ప్రభుత్వ ఉద్యోగం వల్ల అతని కుటుంబానికి ఎంగిలి మెతుకులు తినే కర్మ తప్పింది. ఇండియా లోని దళితుల్లో అత్యధికులు ఇప్పటికీ ఎంగిలి మెతుకులు తిని జీవిస్తున్న పరిస్థితి ఉంది.

ఈ మధ్యే జమయత్‌-ఉలేమా-ఇ -హింద్‌ అనే సంస్థ -మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ ను జాతియ పోరాటానికి అందించింది-దళితులతో స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని ప్ర కటించింది. అది దళితులలో ఒకే పళ్లెంలో భోజ నం చేసే కార్యక్రమం చేపట్టింది. ముస్లిం నాయ కులు మౌలనాలు, మౌలివిలతో సహా, దళితులతో ఒకే పళ్లెంలో భోజనం చేసే క్యాంపియన్‌ హైద్రా బాద్‌లో ప్రారంబించింది. మౌలానా మహ్మద్‌ మ దానీ, జమాయిత్‌ ప్రధాన కార్యదర్శి దళితుల తో కలిసి తిన్నాడు. డిసెంబర్‌ 6, 2002 న ఆల్‌ ఇండియా క్రిస్టియన్‌ కైన్సిల్‌ బిషప్‌ థామస్‌ చెన్నై లో దళితుల పాదాల్ని కడిగి కులతత్వ క్రిష్టియన్‌ సమాజం ఇండియాలో చేసిన పాపాల్ని కడిగేసిన రోజుగా ప్రకటించారు. జమాయత్‌ మార్చి 9, 2003 న ఢిల్లీలో పెద్ద ర్యాలీని నిర్వహించింది. దీనిని దళిత్‌ ముస్లిం ఫ్రంట్‌గా భావించారు. ఈ ఫ్రంట్‌ సంఘ సంస్కరణల కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా చేపడుతుంది. కొంతమంది ఈ ఫ్రంట్‌ దళిత-ముస్లింల రాజకీయ ఫ్రంట్‌గా ఏర్పడవచ్చ ని భావించారు. ఒకవేళ అదే జరిగితే ఇండియన్‌ ప్రజాస్వామ్యం మారవచ్చు.ఏది ఏమైనా ఉలేమా కూడా సామాజిక సంస్థ. అది ప్రతక్షంగా ఎలక్షన్‌ రాజకీయాల్లో పాల్గోనదు. అది ముస్లింల విద్యాభి వృద్ధికి సామాజిక ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తూ వుంది. కానీ గతంలో అది గిరిజనుల, దళితుల వె నుకబడిన కులాల మధ్య పని చేయలేదు.

గుజరాత్‌ మారణహోమం అనేక కొత్త గణ పాఠాల్ని బోధించింది. గుజరాత్‌ అనంతరం ము స్లింలు, ఎవరైతే తమ సామాజిక విద్యా కార్యక్ర మాల్ని తమ వరకే పరిమితం చేసుకున్నారో వారు దళిత బహుజనులతో సామాజిక బంధాన్ని నిర్మిం చుకోవడం ద్వారానే రక్షణ నుంచి కుల నిర్మూలన కార్యక్రమంలో పాల్గోనాలని నిర్ణయించింది. వలస పాలనా కాలం నుంచి క్రిష్టియన్‌ పౌరసమాజం సంఘసంస్కరణ కార్యక్రమంలో పాల్గోన్నది. కాని ముస్లిం సామాజిక శక్తులెప్పుడూ సంఘ సంస్క రణల గురించి మాట్లాడలేదు. గుజరాత్‌ హింస, సమానత్వం కోసం నడుస్తున్న దళిత-బహుజనో ద్యమాలు ముస్లిం సమాజాన్ని విశాల ఇండియన్‌ సమాజంలో సంఘసంస్కరణల అవసరం గురించి ఆలోచించేలా చేశాయి.జమాయిత్‌కు సుదీర్ఘ లౌకి క జాతీయ కార్యక్రమ చరిత్ర ఉంది. బ్రిటీషు పాల నా వ్యతిరేక పారాటంలో ముస్లింలీగ్‌ వ్యతతిరేక రాజకీయాల్ని, ఇండియన్‌ నేషన్‌ కాంగ్రెస్‌ను, గాం ధీని సమర్థించింది. అలా చేయడం వల్ల ముస్లింల చేత నడిచిన ‘హిందూ-ముస్లిం’ల సంస్థగా భావిం చారు. కాని దురదృష్టవశాత్తు అది గత సంవ త్సరం గుజరాత్‌ మారణహోమం జరిగే వరకు దళిత గిరిజన వెనుకబడిన కులాలతో కలసి పని చేయాల్సిన అవసరాన్ని గుర్తించలేదు.

హిందూయిజాన్ని రాజకీయాల్లో ఉపయోగి స్తున్న హిందుత్వ శక్తుల సంస్కరణ ఎజెండాను రూపోందించలేదు. కౌటిల్యనిజంలో వేళ్లు నాటు కోని ఉన్న సావర్కర్‌ బ్రహ్మనిజం రీతిలో వారికి వి శ్వాసం ఉంది. సంస్కరణలు కులతత్వాన్ని, కౌటి ల్యవాదాన్ని బలహీన పరుస్తాయి.ముస్లిం సమాజం భయాందోళనల మధ్య జీవించే స్థితి వచ్చిన సమ యంలో జమాయత్‌ సంస్కరణవాద పాత్రను గు ర్తించినట్టుకనిపిస్తుంది.వారిప్రయోజనాల కొరకు, దేశం కొరకు ముస్లిం సంస్థలు విశాల పౌర సమా జంలో కల్సిపోక తప్పదు. ఒకవేళ ముస్లిమేతర సమూహల్లో పనిచేస్తు హిందుత్వ శక్తులు మతమా ర్పిడి ఎజెండాగాచిత్రించవచ్చు.నిజానికి హిందూ మతం కష్టమైన పిరిస్థితుల్లో ఉంది. ఒకవేళ జీవి తం లోని అన్ని పార్శ్వాల్లోంచి కుల వివక్షని నిర్మూ లించకపోతే, అదిఇంకెంత మాత్రం క్షేమకరమైంది కాదు దాని మతతత్వ ఎంజెండా దాని అభద్రత యొక్కఫలితం,మైనారిటీ మతాలు కుల సమస్యను పట్టించుకుంటే అణగారినవారు తప్పకుండా వాటి పట్లథృక్పధాన్నిమార్చుకుంటారు. ముస్లిం సంస్థలు సొంత సమాజాన్ని సంస్కరించుకోవాలి. ఆరెస్సెస్‌ నిర్వహిస్తున్న పాఠశాలల్లాంటివి నడపటంవల్ల మతవాద భావజాలాన్ని నాటుతున్నాయి.

-వేముల ఎల్లయ్య,స్కైబాబ

ఇంకావుంది…