తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

అశుద్దమైన పనులు చేయువారు ఇస్లాం తీసు కోవడం కారణంగా వీరిని ఉన్నత, నిమ్న కులా లకు చెందిన ముస్లింలందరూ అంటరానివారుగా చూస్తారు. బీహర్‌లోని భంగీలు ఆంధ్రప్రదేశ్‌లోని మెహతర్‌లు దీనికి ఉదాహరణ..ఈ విధంగా భార తీయ ముస్లిం సమాజంలో కుల ప్రాతిపదికన స్ప స్టమైన విభజనలున్నాయి. భారతీయ ముస్లిం సమాజంలో కుల వ్యవస్థ లేదని కొంతమంది వాదిస్తుంటారు. కానీ ఆంత్రోపాలజిస్టులూ, సమా జ శాస్త్రవేత్తలూ విస్తృతంగా పరిశోధనలు చేసి ముస్లిం సమాజంలో ఉన్న వ్యవస్థకూ, హిందూ సమాజంలో ఉన్న వ్యవస్థకు మధ్య ఉన్న కొన్ని ప్రథమిక వ్యత్యాసాలు బయటపెట్టడం జరిగింది. హిందూ సమాజంలోని కులవ్యవస్థలా ముస్లిం సమాజంలో కులవ్యవస్థ విస్తృతంగా, లోతుగా వేళ్లూనుకోని లేదు. వివిధ ప్రదేశాల్లో వివిధ రకా లుగా పైపైనా మారతత్రమే ఉంది. అంటే ముస్లిం సమాజంలోని కులవ్యవస్థ బలహీనంగా పుంది. హిందూ కులవ్యవస్థకు మత ధర్మశాస్త్రాల ఆమో దం, అండ ఉండగా, ఇస్లాం సిద్ధాంతపరంగానే కులవ్యవస్థకే కాదు, ఏ విధమైన వివక్షకైన బద్ద వ్యతిరేకి. ఇంకోవిధంగా చెప్పాలంటే హిందూ కులవ్యవస్థకు మతపరమైన సైద్దాంతిక భూమిక ఉంది, ముస్లిం సమాజంలోని కుల వ్యవస్థకు లేదు. హిందూ సమాజంలోని కులవ్యవస్థ పవిత్ర త, అపవిత్రత అనే భావజాలాధారంగా ఉండగా ముస్లింల సమాజంలోని కుల వ్యవస్థలో పుట్టుక, వంశం వంటి అంశాలమీద ఆధారపడి ఉంది. హిందూ కులవ్యవస్థలో లాగా భ్రాహ్మణులవంటి కర్మకాండరీత్యా సర్వాధికులుగా భావించే ఒక ప్ర త్యేక కులం ముసిలం కుల వ్యవస్థలో లేదు. సయ్యద్‌లున్నా వారికి హిందూ సమాజంలోని ప్రహ్మణులకున్నంత ప్రాధాన్యత లేదు. ప్రముఖ సామాజిక రాజనీతిశాస్త్రవేత్త అయిన ఇంతియాజ్‌ అహ్మద్‌ ప్రకారం మహమ్మద్‌ ప్రవక్త కాలంలోనే ముస్లింలలో పుట్టుక, బంధుత్వం, ప్రవక్తతో దగ్గరి తనం అనే అంశాల ఆధారంగా ముస్లింలలో ఎక్కు వ, తక్కువ బేధాలేర్పడినాయి. ప్రవక్త పుట్టిన తెగ అయిన కురేష్‌ తెగవారు ముస్లింలందరిలోకి సర్వో న్నతులుగా భావింపబడేవారు. ఇట్లాంటి అసమా నతలతో భారతదేశంలోనే ప్రవేశించిన ఇస్లాం యిక్కడి కులవ్యవస్థతో తలపడి, దానిని సమూ లంగా నిర్మూలించలేకపోయింది. పైగా ఇస్లాంలో కీ కులం ప్రవేశించి అవకాశం ఇచ్చింది. అయిన ప్పటికీ భారత ముస్లిం సమాజంలో ఎన్ని రకాలైన విభజనలున్నా మత పరమైన ముస్లిం ఐడెంటిటీ చాలా బలంగా ఉందని మాత్రం బలంగా విశ్వ సించవచ్చు

వెనుకబాటుకి గరిచేయబడ్డ ముస్లింల స్థితిగతులు

విద్యా రంగంలో: ప్రణాళికా సంఘం సర్వే 19 87  ప్రకారం భారతదేశ సగటు అక్షరాస్యతా శా తం 52 శాతం కాగా, ముస్లింలు 42 శాతం మా త్రమే. హైస్కూలు విద్యను పూర్తి చేసిన హిందూ వులు 7.9 శాతం కాగా ముస్లింలు కేవలం 4.5 శాతం. ముస్లింలలో కేవలం 2.3 శాతం పట్టబ óద్రులు కాగా హిందూవుల్లో 7.9 శీతం. ప్రథమికో న్నత విద్య నాటికి బడికి వెళ్లే ముస్లిం విద్యార్థుల్లో సుమారు 1/3 వంతు డ్రాపవుట్‌  అవుతున్నారు. 10-14 మధ్య వయసులో దాదాపుగా 50 శాతంమంది డ్రాపవుట్‌ అవుతున్నారు. ముస్లిం స్త్రీలలో నిరక్షరాస్యులు 66 శాతం. ఒకే ఒక్క శా తం హైస్కూలు విద్యను అందుకో గలుగుతున్నా రు. ఆంధ్రప్రదేశ్‌లో 8 శాతం నుండి 12 శాతం ముస్లిం బాలికలు హైస్కులు విద్యను పూర్తి చేశారు  భారత ముస్లింల విద్యాస్థాయి ఎస్సీ, ఎస్టీల కన్నా తక్కువగా ఉందని నేషనల్‌ పాలసీ ఆఫ్‌ ఎడ్యుకేష న్‌ ఘంటాపథంగా చెప్పింది. క్రైస్తవ, సిక్కు మైనా రిటీలతో పోల్చి చూసినప్పుడు కూడా ముస్లింలు ఎంతో వెనకబడి ఉన్నారు. ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉర్దూ మీడియంలో చదువుతుండడం, ఉర్దూ మీడియం పాఠశాలలు అరకోర సౌకర్యా లతో ఉండడం మొదలైన అసంఖ్యక కారణాల వలన కూడా ఉన్నత విద్యను అందుకోలేక పోతుండడం గమనర్హాం.

ఆర్థిక రంగంలో

వ్యవసాయ భుములు కలిగి ఉండడంలోగానీ, చెప్పుకోదగ్గ వ్యాపారాల్లోగానీ ప్రభుత్వోద్యాగాల్లో గానీ, ప్రైవేట్‌ పరిశ్రమల్లోగానీ ముస్లింలు అంచు లకు నెట్టివేయబడి దుర్బర  దారిద్య్రాన్ని అనుభవి స్తున్నారు. దయనీమైన జీవితాలను గడుపుతు న్నారు. నేషనల్‌ సాంపుల్‌ సర్వే 43 వ రౌండ్‌ ప్రకారం 45 శాతం మంది భారత ముస్లింలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ఒక అనధికార సర్వే ప్రకారం 63 శాతం మంది ముస్లింలు దారి ద్య్రరేఖకు దిగువన ఉన్నారని తెలుస్తుంది.

ముస్లింలలో వ్యవసాయ భూముల కలిగిన వారు చాలా తక్కువగా ఉన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ఒ 43వరౌండ్‌ప్రకారంవ్యవసాయభూమిలేని హిందూ వులు 28 శాతం మాత్రమే కాగా ముస్లింలు 35 శాతం. బ్యాంకుల నుండి లోన్లు, ఇతర ప్రభుత్వ స్కీముల నుండి రుణ గ్రహీతలుగా ముస్లింల శా తం 9.41 శాతం మాత్రమే

క్లాస్‌-1, క్లాస్‌-2 ఉద్యోగాల్లో ముస్లింలు కేవ లం 3 నుండి 4.5 శాతం వరకున్నారు. క్లాస్‌ -3  క్లాస్‌-4 ఉద్యోగాల్లో 5 నుంచి 6 శాతం వరకు న్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 82 ప్రభు త్వ రంగ సంస్థల్లోని 449 మంది డైరెక్టర్లలో కేవ లం 2.32 శాతం ముస్లింలున్నారు. ముస్లిం జ్యూ డిషియాల్‌ ఆఫీసర్లు 6.19 శాతం ఉన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని డిపార్టుమెంట్లలో చాలావాటి లో ముస్లిం ఉద్యోగస్తులు కనిపించరు. కొన్నింటి లో నామమాత్రంగా ఉన్నారు. 1970-80 మధ్య లో ముస్లిం ఇంజనీర్లు 2 శాతం డాక్టర్లు, 2.5 శా తం ఐఎఎస్‌ వివిధ రంగాల్లో ముస్లింలు వెనుక బడి ఉన్నారు.

ప్రైవేట్‌ రంగంలో

ముస్లింల ప్రాతినిధ్యం దయనీయంగా ఉంది. ప్రైవేట్‌ రంగ సంస్థల్లో ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో 2 శాతం కన్నా ఎక్కువ. సూపర్‌వైజర్‌ స్థాయిలో 3 శాతం కన్నా తక్కువ. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియాలోని ఐదుగురు మెంబర్లు, 18 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లలో ఒక్క ముస్లిం లేడు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలోని సెంట్ర ల్‌ బోర్డులోని 19 మంది సభ్యుల్లో ఒక్క ముస్లీం లేడు. 60 మంది డైరక్టర్లు, మేనేజర్‌ స్థాయి ఎగి ్జక్యూటివ్‌లలో కేవలం ఇద్దరే ముస్లింలు. పరిశ్ర మల ఓనర్‌షిప్‌ విషయంలో దేశంలోని మొత్తం 2832 పారిశ్రామిక సంస్థల్లో కేవలం నాలుగిం టిని ముస్లింలు కలిగివున్నారు. పెద్ద, మధ్య తరహా పరిశ్రమల్లో ముస్లిం ఓనర్‌షిప్‌ అసలే లేదని భా వించవచ్చు… అత్యధిక  శాతం మంది చిన్నచిన్న వ్యాపారులు గాను, టైలర్లు, మెకానిక్‌లు, రిక్షా, ఆటొడ్రైవర్లు, పండ్లమ్మేవాళ్లు…ఆధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పట్టణాలు, నగరాల్లోని మొత్తం బాలకార్మికుల్లో 25 శాతం ముస్లిం పిల్లలున్నారు. కేవలం హైదరాబాద్‌ బాలకార్మికుల్లో 36 శాతం ముస్లిం పిల్లలున్నారు. ఆర్థిక దారిద్య్రం కారణంగా వేశ్యావృత్తిలోకి లాగివేయబడుతుతోన్న వారిలో దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు అధికంగా ఉన్న ట్లు అనేక సర్వేలు చెబుతున్నాయి.

-వేముల ఎల్లయ్య, స్కైబాబ

ఇంకావుంది…