తెలంగాణ అలాయ్ బలాయ్
ఆంధ్రప్రదేశ్ ముస్లింలు సిగ్గు పడాల్సిన మరో విషయం దక్షిణ భారతదేశంలోని మిగిలిన మూ డు రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు ముస్లిం లందరూ వెనుకబడిన తరగతి క్రింద రిజర్వేషన్ ప్రయోజనాలు పోందుతుండడం. కర్ణాటకలో ము స్లింలకు ముస్లింలుగా వెనుకబాటుతనం, ప్రాతిపదిక 4 శాతం రిజర్వేషన్లుండడమే కాకుం డా వృత్తి కులాల ప్రాతిపదికపై ఇంకో 4 శాతం రిజర్వేషన్ లభిస్తోంది. కేరళలో ముస్లింలకు 12 శాతం కోటా ఉంది. తమిళనాడు ప్రభుత్వం వెను కబడిన తరగతుల వారికై కల్పించిన 50 శాతం రిజర్వేషన్‌లో ముస్లింలు 5.21 శాతం పోందుతు న్నారు. వీరిలో కొంతమంది చాల వెనుకబడిన కేటగిరిలోని రిజర్వేషన్‌ను కూడా పోంది ఉన్నారు. దక్షిణ భారత దేశంలోని మిగిలిన రాష్ట్రాల ముస్లిం లకు రిజర్వేషన్‌లు లభిస్తోండగా, ఆధ్రప్రదేశ్ ముస్లింలకు లభించకపోవడం పాలకవార్గాల చిత్త శుద్ధినీ ,ముస్లింల అభివృద్దిపట్ల వీరికున్న శ్రద్దనూ స్పష్టం చేస్తోంది. అలాగే ఇక్కడి ముస్లిం మేధా వులూ, రాజకీయ నాయకుల సామర్థ్యాన్ని శంకిం చే పరిస్థితినీ, ప్రజల్లోని చైతన్య రాహిత్యాన్ని బహిర్గతం చేస్తుంది.
ముస్లింలకు రిజర్వేషన్ కావాలన్న వాదన పలుచోట్ల వినిపిస్తోంది. కొందరు పత్రికల ద్వారా తమ ఆలోచనలను వెల్లడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొదటి ఓబీసీ కమీషన& అయిన అనంతరా యన్ కమీషన్‌కు ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహా దుల్ ముస్లిమీన్, హైదరాబాద్ ఇన్‌కంటాక్స్ పరిధి లోకి రాని ముస్లింలందర్నీ వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాల్సిందిగా ఒక మొమొరాండంను సమర్పించింది. కానీ వీరి కోరిక వెనుకబడిన తరగతుల నిర్ధారణకైక నిర్ణయించబడిన నిబంద óనల పరిధిలోకి రానందున, కమీషను దానిని అంగీకరించలేదు. మురళీధరరావు కమీషన్ నూర ్‌బాషీయులు కాక మరింతమంది ముస్లింలను వెనుకబడిన తరగతుల జాబితతాలో చేర్చాలను కున్న విషయం కూడా అటకెక్కింది. ముస్లింలను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలనుకున్న విషయం పరీశీలించేందుకై 1994 మార్చి 31 న ఏర్పరచబడ్డ పుట్టుస్వామి కమీషన్ ప్రభుత్వ మురికి పుట్టలోంచి ఇంతవరకూ బయట పడలేకుంది.ముస్లింలకు మతపరంగా రిజర్వేషన్ల నివ్వడం లౌకికవాదానికి భంగకరమని సెక్యుల రిజం బాకాలనూదే అపర సెక్యులార్ మహా శయులు ఇక్బాల్ అన్సారీ మాటల్ని కాస్త అర్థం చేసుకోవాలి.
భారతదేశ విభజనానంతరం దేశంలో తలె త్తిన అవాంఛనీయ పరిస్థితుల దృష్ట్య లౌకిక భావా ల పరిరక్షణను ముస్లింల రిజర్వేషన్‌తో ముడిపెట్టి ముస్లిం ప్రయోజనాలను లౌకికవాద భావాల పెంపుదల, ప్రజలలో ఐక్యతా సాధనలనే యజ్ఞం లో సమిధలుగా మార్చారు. రిజర్వేషన్లు వదులు కున్నందుకు ముస్లింల పట్ల ఉదారంగా వ్యవహరి స్తామని చేసిన హామీలకు నేడు నాం నిశానీ లేకుండా పోయింది. సర్వసత్తాక, ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక, గణతంత్ర భారతదేశంలో ముస్లింలను విద్యాపరంగానూ, ఉద్యోగాల్లోనూ, ఆర్థికరంగంలోనూ రాజకీయ రంగంలోనూ అంచులకు నెట్టివేయడంలో మాత్రం భారతదేశ పాలకవార్గలు ఎంతో ఉదారంగా వ్యవహరిం చాయని ముస్లింల దయనీయ పరిస్థితి చూస్తే స్పష్టమవుతుంది. వివిధ గణాంకాలను పరిశీలిస్తే ముస్లింల పట్ల ఒక పటిష్టమైన వివక్ష కొనసాగు తోందని తెలుస్తుంది. 1999 నాటికి భారత సైనిక దళాల్లోని మొత్తం పదకొండు లక్షల మందిలో ముస్లింలు కేవలం ఒకే ఒక్క శాతం ఉండడం వివక్ష కాదా? పాలక పీఠాలకూ పావులు కదిల్చిన ప్పుడల్లా ముస్లింల ఖండిత దేహ రుధిర ధారల్తోనే కాదా భరత భూమి ఎర్రబడుతోంది? మతక ల్లోలాలు, ముస్లిం నిర్మూలనా కార్యకలాపాలలో విషనాగులు పడగ విప్పినప్పుడల్లా ఎండుటాకుల్లా రాలిపోతున్న వారు ముస్లింలు కారా? మిమ్మల్ని రక్షించడానికి మాకు ఆదేశాల్లేవు అని పోలీసులు ముస్లింలపై సాగుతున్న దమన కాండను కళ్లారా చూస్తూ ఉండడమే కాకుండా, మతోన్మాద గుండా లతో చేతులు కలిపి ముస్లింలపై కాల్పులు జరప లేదా? దేశంలోని ప్రతి 27 మంది సీనియర్ పోలీసాఫీసర్లలో ముస్లింలు కేవలం ఒకే ఒక్కడుం డడం కేవలం యాధృచ్చికమా? ముస్లింల రిజర్వే షన్ ఉద్యమం ప్రజాస్వామ్యయుత పద్ధతుల ద్వారా సాగాలి. ఈ బిమాండు న్యాయపూరిత మైనదేనన్న దిశలో ముస్లిమేతర ప్రజల అభిప్రా యాన్ని కూడగట్టుకోవాలి. లౌకికవాదులైన ముస్లి మేతర మేధావుల మధ్దతు ఎలాగైన ఉంటుంది. మత ఘర్షణల్లో మతోన్మాఅయదులు ముస్లింలను అగ్రవర్ణం వారా నిమ్మన వర్ణం వారా అనే ప్రాతిప దికపై చంపడం లేదన్న విషయం గుజరాత్‌తో సృష్టమైపోయింది. మతోన్మాదుల ఖడ్గాలు, త్రిశూ లాలు అగ్ర, నిమ్న అనే తేడాను పాటించ డం లేదు. మస్లిమైతే చాలు… గుజరాత్‌లో ఎహ్‌సాన్ జాఫ్రి అనే మాజీ ఎంపిని చంపడం మన ముందు న్న సృష్టమైన సాక్ష్యం ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీల ఔక్యత గూర్చి మాట్లాడే వారు తమ నినాదాలకు బలం చేకూరేందుకు ముస్లింల రిజర్వేషన్ డిమాం డ్‌ను సమర్థించి, ఉద్యమానికి తమ సహాయ సహాకరాలు అందించాలి.
ఇక తమ సమస్యలను ఎవరో వచ్చి తీర్చరనీ, తమ భాగ్యవిధాతలు తామేనని ముస్లిం ప్రజలు కూడా గుర్తించాలి. ముస్లింలు ఈ దేశంలో విడ దీయరాని, విడదీయలేని అంతర్భాగం. దేశ ప్రజ ల్లోని ఒక భాగం దాదాపు మొత్తంగా వెనుకబడి ఉన్నప్పుడు దేశం సర్వతో ముఖంగా అభివృద్ది చెందుతుందని ఎలా ఆశించగలం? ముస్లింల భౌతిక పరిస్థితులను అభివృద్ది చేయడానికై తద్వా రా దేశాబివృద్దికై, ముస్లింలకు రిజర్వేషన్ అత్యం తావశ్యకం.
-స్కైబాబ
మైనారిటీ సాహిత్య డిస్కోర్స్ – సిద్ధాంత చర్చ
ముస్లిం మైనారిటి సాహిత్యం అస్తిత్వవాదం అభివృది మాత్రమే అయితే దానికి చాలా పరిమి తుల తప్పకుండా ఉంటాయి. సైద్దాంతిక చర్చ సక్రమంగా నడవాలంటే ప్రధానమైన, మౌలిక మైన అంశాల్ని నిర్ధిష్టంగా అంచనా వేయటం, వివ్లేషించడం జరగాలి. ముస్లిం మైనారిటి సాహి త్యంమీద జరిగిన చర్చ కొంత ఉదారవాద, మత సంస్కరణవాద కోణం నుండి జరిగింది. యురో పియన్ సాహిత్యంలో వలస వాదానంతర సిధ్దాం తాల్లో మైనారిటీ డిస్కోర్స్ అనేది ఒక ప్రధాన అంశంగా ఆవిర్భవించింది.అబ్ధుల్ మోహమ్మద్, డెవిడ్ లొడ్‌అనే ఇద్దరు ప్రతిపాదించిన సిధ్దాంతం ప్రపంచ వ్యాప్తంగా చర్చను లేపింది.
ఇండియన్ పౌర సమాజంలో, సాహిత్య సమాజంలో అనివార్య పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఆవిర్భవించిన మైనారిటి వాదానికి యూరోపియన్ తదితర దేశాల మైనారిటి వాదానికి చాలా తేడా ఉన్నది. అక్కడ మైనారిటిలంటే అగ్ర దేశాల దురా క్రమణలో ఉన్న దేశాల ప్రజలు, వివిధ దేశాల నుండి వచ్చిన వలస జీవులు, కాందీశీకులు, నల్ల జాతీయులు, స్త్రీలు చివరగా మత మైనారిటీలు జాన్ మహమ్మద్ దృష్టిలో అణచివేతకు గురవు తున్న అందరూ మైనారిటి డిస్కోర్స్ పరిధిలోకి వస్తారు. అందువల్ల అది సాధారణీకరించిన నిర్వ చనంగా కనిపిస్తుంది. దీనివల్ల వారిద్దరూ ప్రపంచంలో అణచివేతకు గురవుతున్న స్త్రీ జాతి దేశ తదితర రాశులందరినీ మైనారిటీలుగా పరిగ ణించి విశ్లేషణ చేశారు. కాని ఇక్కడ ముస్లిం క్రిస్టి యన్ ఇతర మతాల ప్రజలు మైనారిటీలనీ నిర్ది ష్టంగా చర్చించడంవల్లనే మైనారిటి డిస్కోర్స్ సాధ్యమవుతోంది.
ఇండియన్ మైనారిటీ వాదం పట్ల నిర్దిష్ట పరిశీలన చేయకపోతే అది ఒక మతానికి చెందిన వ్యక్తుల వ్యక్తీకరణగా పొరపడే అవకాశం ఉన్నది. భిన్న సంస్కృతుల, మతాల పౌర సమాజంలో మైనారిటీ సమూహాల వ్యక్తీకరణ నేపథ్యాన్ని తాత్వి క పూనాదిని పరిశీలించాలి. తెలుగు మైనారిటీ సాహిత్య సిధ్దాంతం గుర్తింపు సమస్య గురించి బాధపడటం లేదు. హిందూత్వ దాడి, దాని ఫాస ిస్టుస్వబావాన్ని రాజకీయ సైద్ధాంతిక కోణం నుండి వ్యక్తీకరిస్తోంది.
-వేముల ఎల్లయ్య, స్కైబాబ
ఇంకావుంది…