తెలంగాణ అలాయ్ బలాయ్
మైనారిటీ నిర్వచనమే బలహీనంగా ఉన్నది. నిర్దిష్ట భౌగోళిక భూబాగంలో నివసిస్తున్న ప్రజా సమూహాంలోని అల్ప సంఖ్యాక మత ప్రజల్ని మై నారిటీలుగా ఇప్పటి వరకు సాధరణీకరించిన నిర్వచనం పరిధిలో విభజించాము. జాన్ మహ మ్మద్ ప్రకారం మైనారిటీలను రాజ్యం అధికారం కోణం నుండి నిర్వచించాలి. నిజానికి అధిక సం ఖ్యాకుల్ని రాజకీయ అధికరం నుండి దూరం చేయడం వల్ల మైనారిటీలుగా చేయబడ్డారు. మన దేశంలో శూద్రులు, దళితులు, గతంలో దక్షిణ ఆఫ్రికాలో నల్లవారు, అన్ని దేశాల్లో స్త్రీలు మైనారి టీలుగా చూడబడ్డారు. ప్రస్తుత కొత్త రాజకీయ పరిస్థితుల్లో మత మైనారిటీలు అగ్రకుల హిందు త్వ రాజ్య అణచివేతకు, దాడికి గురవుతున్నారు. పౌర సమాజంలోని అల్ప సంఖ్యాక సమూహాలు ఎప్పుడూ స్థానిక సమూహాలతో అనేక రూపాల్లో సమ్మిశ్రితం అవుతాయి. ఫలితంగా అవి స్థానాన్ని పోందుతాయి. క్రమంగా ఆ సమాజంలో విడదీ యరాని సమగ్ర ఐక్యతల్లో కలిసిపోతాయి. ఇలా జరగడం మన సమాజంలో చూశాం. అయితే పూ ర్వ ఆధిóపత్య సమూహాలు వారిని మిళితం కాకుం డా నిరోదించే ప్రయత్నం చేస్తాయి. ఇది స్థానిక సమూహాల కోసం చేస్తున్న ఎదిరింపుగా ప్రచారం చెందుతుంది. గుజరాత్‌లో జరిగిన నరమేధం ఇలా జరిగిందని భావించవచ్చు.
ముస్లిం మైనారిటీ సాహిత్యం దళిత సాహి త్యంతో మిళితం అయింది. మైనారిటీలు దళితు లతో కలిసిపోయిన రీతిని ఇక్భాల్‌చంద్ ఆరోవర్ణం కవిత, ఖాజా రూట్స్ కవిత, స్కైబాబ దస్తర్ కథ, మార్ఫా, తురక వాడలు, కవితలు చూపించాయి. దళిత కవిత్వం ఉద్యమంగా రూపోందడంలో మైనారిటీల పాత్ర కీలకమైంది. దీనికి కారణం ఇస్లాం మతంలో హిందూ మత ప్రభావంవల్ల ఏర్పడిన నిచ్చెనమెట్ల కుల అంతరాలుకూడా ప్ర ధానమైంది. దూదేకుల ముస్లిం ప్రజలు ఇటు హిందూ వ్యవస్థతో, అటు ముస్లిం ఛాందస వాదం తో అణచివేతకు వివక్షకు గరయ్యారు. ముస్లిం స్త్రీ లు మతం విధించిన అనేక వివక్షా రూపాల్లో తీవ్ర మైన దోపిడీకి గురయ్యారు. సెక్యులార్ రాజ్యం అనేది ఆధునిక వ్యవస్థ లక్షణం. అనేక మత యుద్ధాల ఫలితంగాత, అనేక భావ ఆవిష్క రణల పరిణామలవల్ల ఇది సాధ్యమైంది. హేతు వాదం యూరోపియన్ సమాజాన్ని తీవ్రంగా ప్రభా వితం చేయడం వల్ల మత ప్రమేయం లేని ఉదార రాజ్యా లు వెలిసాయి. సహనం గొప్ప లక్షణంగా ప్రచా రం చేయబడ్డది. దీని గురించి చెబుతూ చక్ర వర్తి కాలంలో ముస్లిం, క్రిస్టియన్, యూదులు స్వీ య పాలనా శాఖల్ని కలిగి ఉండేవారని, తమ మత సభ్యుల మీద అంక్షలు విధించే అనుమతి ఉండేద ని చెప్పాడు. ప్రస్తుత ఆధునిక ఉదాహరణ బంగ్లా దేశ్‌లో ముస్లిం మత గురువులు తస్లీమా నస్రీన్ ‘లజ్జ’ నవల రాసినందున శిరచ్చేదనకు ఫత్వా జా రి చేసిన సంఘటన సరిపోతుంది.
ఇలాంటి ఘటనలు విడిగా స్వతంత్రమైనవిగా కనిపిస్తాయి కాని ఇవి రాజ్యం నిర్వహించే మత రూపాలు. రాజ్యం అంతటా ఉంటుంది. అనేక రూపాల్లో ఉంటుంది. రాజ్యం మన మనసులో, ఒంటిలో, పడగ్గదిలో, లైంగికతలో ఉంటుంది. మెజారిటీ, మైనారిటీ అనే విభజనే వీటి మధ్య ఉ న్న సంబందాన్ని రాజ్యంగా అర్థం చేసుకోవచ్చు హిందుత్వ ఫాసిజంగా మైనారిటీలు ఈ దేశంలో ఉండాలంటే తమ ప్రతత్యేక అస్తిత్వాన్ని వదులు కోవాలని, హిందూ మతీకరణకు సిద్ధపడాలని చెబుతున్నది. లేకపోతే కనీస పౌర హక్కులు కూ డా ఇవ్వబడవని గోల్వాల్కర్ మనము మన జాతీ యతకు నిర్వజనం అనే గ్రంథంలో నిర్దేశించాడు. సుదర్శన్ అందులో భాగంగానే పర మతాల్ని భార తీయీకరించాలని ప్రకటించాడు. ఇది నిచ్చెన మెట్ల అధికార నిర్మాణాన్ని వ్యవస్థీకృతం చేయడం లో భాగంగా జరిగిందని భావించడం సరైంది. ఇతర దేశాల మైనారిటీ సమూహాల సమస్యకు భిన్నంగా ఇండియన్ మైనారిటీల సమస్య ఉన్నది. వందల యేల్లుగా ఈ సమాజంలో కలిసిపోయి జీవిస్తున్న ముస్లింల మీద అగ్రకుల హిందూత్వ శక్తులు దాడి చేస్తున్నాయి. బాబ్రీ మజీదు విధ్వం సం తరువాత ముస్లింల ముస్లింల అస్తిత్వం తీవ్ర మైన ప్రమాదంలో పడింది. ఇంకా స్పష్టంగా చె ప్పాలంటే దళిత, గిరిజన, బీసి, ముస్లిం తదితర మైనారిటీ సమూహాలు ఫాసిజం ముప్పేట దాడికి గురైనాయి. అయితే వ్యూహత్మకంగా ముస్లింలను దాడికి ఎంపిక చేసుకోవడం వల్ల ఇది కేవలం ఒక సమూహానికికి పరిమితమైన అంశంగా ప్రచారం చేయబడుతుంది అంతే కాదు రెండు భిన్న మతా ల మధ్య జరుగుతున్న ఘర్షణగా చూపడం వల్ల భవిష్యత్తులో జరగబోయే చారిత్రక విపత్తును మరుగుపరుస్తున్నారు.
అయితే ముస్లిం మైనారిటీ సాహిత్యం వాస్తవి కతని సరిగానే గమనించింది. తన పోరాటాన్ని ఇతర సమూహాల ఆర్యమాలతో లింకు చేయడం ద్వారా మాత్రమే తన లక్ష్యాన్ని సాధించవచ్చనే వాస్తవాన్ని గ్రహించింది. రెండు స్థాయిల్లో ముస్లిం వాదం పోరాడుతుంది. ఒకటి ముస్లిం మతంలోని ఛాందసత్వానికి వ్యతిరేకంగా పోరాటం. దీన్ని ము స్లిం స్త్రీవాదం ప్రధానంగా కొనసాగిస్తుంది. రెండు హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం. గుజరాత్ నరమేధం సందర్భంలో వచ్చిన సాహి త్యం ప్రధానంగా కవిత్వం ఈ రెండో అంశానికి సంబందించింది.
హిందుత్వ వ్యతిరేక పోరాటంలో భాగంగా సెక్యులర్ కవులు ముస్లిం కవులకు మద్ధతుగా నిల బడుతున్నాయి. అలా వచ్చిందే గుజరాత్ గాయం ప్రజాస్వామిక సెక్యులర్ శక్తులు వామపక్షాలు హిందూత్వ వ్యతిరేక పోరాటం చేస్తున్నాయి. అ యితే ముస్లింలను ఊచోత కోసినప్పుడు వారి స్పందనను పరిశీలిస్తే మానవతా వాదం కనిపి స్తుంది. చూడలేని గుడ్డితనందాని ప్రధాన లోపం ముస్లింలను హత్య చేయడాన్ని మాత్రమే నిరసించి మత సామరస్యం కేవలం ప్రజల సున్నిత ఉద్ర ేకాల వల్లనే పాడవుతుందనే పరిమిత నిర్ణయం అందులో అంతర్లీనంగా దాగి ఉంటుంది. ముస్లి మేతర కవుల కవితల్ని పరిశీలిస్తే ఈ అంశం బో ద పడుతుంది.ఉదారవాద మానవతావాదం మరీ బలహీనమైంది. ఇది ఇతర మతాలలోని, స్వమ తంలోని మంచిని గురించి మాట్లాడి, రాజకీయాల కతీతంగా కారణాల్ని విశ్లేషించడం, పరిష్కారాన్ని ప్రతి ప్రాదించడం చేస్తుంది. ఇలాంటి హిందూ మత వాసనలున్న కవితలు కూడా గుజరాత్ గాయంలో కనిపిస్తాయి.
దళితుల రాసిన హిందుత్వ వ్యతిరేక కవి తలు, పాటలు దాని పునాదిని భావజాలాన్ని సరి గ్గా బహిర్గతంచేశాయి.ఫాసిజం హిందూ ఫాసిజం రెండిటి మద్య స్వాభావికమైన తేడా ఉన్నది. హిట్ల ర్, ముస్సోలినిల ఫాసిజం ఆర్య జాతి దురహం కారాన్ని రాజ్యంగా వ్యవస్థీకరించాలని ప్రయత్నిం చింది. దానికి తన జాతిలో నిచ్చెన మెట్ల నిర్మాణ దొంతరలు ఏర్పాటు చేసి స్థిరీకరించే స్వభావం లేదు. పైగా అది తన జాతి ఔన్నత్యాన్ని విశ్వ వ్యా పితం చేయాలనుకున్నది. అందుకే దానికి తప్పు డుదైనా బ్రహ్మండమైన మద్ధతు ఆ దేశాల్లో లభించింది.
కాని హిందూ ఫాసిజానికి బ్రహ్మణీయ అగ్ర కుల ఆధిపత్య వ్యవస్థని స్థీరికరించాలనే స్వాభా విక లక్షణం ఉన్నది. ఈ సమాజంలోని దళిత కులాల్ని శాశ్వతంగా అణచివేసే దుర్మార్గమైన కుట్ర ఉన్నది. దాన్ని దళిత కవిత్వం సరిగా గుర్తిం చింది. మానవత్వం, కవిత్వానికి చాలా అవసరం కావచ్చు కాని శత్రువు స్వబావాన్ని గుర్తించడంలో దానికి చోటు లేదు. ఎందుకంటే మానవతావాదం శత్రువు పట్ల ఉదార మినహాయింపుల్ని ప్రకట స్తుంది.ముస్లింవాద కవిత్వంలో ఉదారవాదానికి చోటు లేదు. అందుకే అది చర్చనీయాంశమ యింది. ప్రతిఘటించే లక్షణం కనిపిస్తుంది పుట్టు మచ్చ మొదలు జల్‌జలా, అజాం వరకు ఈ ప్రతి ఘటన కనిపిస్తుంది. ముస్లిం స్త్రీవాద కవిత్వం ఇంకా బలంగా తన నిరసన ప్రతిఘటనను చూప ిస్తుంది.శత్రువులుస్పష్టంగా కనిపిస్తున్నా, మిత్రులు అనే సమూహాలు శత్రు శిబిరంతో కలిసి దాడులు చేయడాన్ని వాస్తవిక దృష్టితో విమర్శిస్తుంది.
-వేముల ఎల్లయ్య, స్కైబాబ
ఇంకావుంది…