గిరి ప్రదక్షణ రోడ్డు నిర్మించండి
సంగారెడ్డి, డిసెంబర్ 02( జనం సాక్షి)
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ
సభ్యులు అడెల్లి రవీందర్
సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల బీరంగూడ లోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయానికి గిరి ప్రదక్షణ రోడ్డు నిర్మించాలని
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడెల్లి రవీందర్
అన్నారు. మంగళవారం బీజేపీ పట్టణ అధ్యక్షులు అనిల్ చారి తో కలసి దేవాలయం ఈఓ , ఆలయ చైర్మన్ సుధాకర్ కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా అదెల్లి రవీందర్ మాట్లాడుతూ… ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ప్రఖ్యాత ప్రముఖ దేవాలయం బీరంగూడ లోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయమని ఇట్టి దేవాలయానికి మహాశివరాత్రి, కార్తీకమాసం, శ్రావణ మసాలాలో లక్షలాదిగా భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటారని వారు అన్నారు. ఇట్టి దేవాలయం స్థలం కబ్జాలకు గురి అవుతుందడంతో ఆలయానికి హాజరయ్యే లక్ష ల సంఖ్యల భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుచున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థలాలు కబ్జా కాకుండా ఉండడానికి శివాలయం ముందునుండి వెంకటేశ్వరా ఆలయంకిందుగా పద్మశాలి భవనం నుండి గోశాల , శివానంద ఆశ్రమంముందునుండి శివాలయం వరకు గిరి ప్రదక్షణ రోడ్డు నిర్మిస్తే భక్తులకు అనుకూలంగా ఉంటుందని వారు తెలిపారు. తక్షణమే గిరి ప్రదక్షణ రోడ్డుప్రారంభించాలని కోరారు. ఆలయ ఈవో, చైర్మన్ స్పందించి అతి త్వరలో గిరి ప్రదర్శన రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడెల్లి రవీందర్, పట్టణ



