తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

దళిత హిందూ స్త్రీల కంటే ముస్లిం స్త్రీ ఎక్కు వ నిర్భందాలకూ బాధలకూ గురవుతుంది. ఈ అంశాన్ని కవూలూ కవయిత్రులు చాలా బలంగానే కవిత్వీకరించారు.అయితే షాజాహాన రాకతో ము స్లిం స్త్రీ జీవితం గాఢంగా అక్షర బద్దమయ్యింది. ఇవాళ ముస్లిం స్త్రీ వాద కవిత్వానికి షాజాహానా మారుపేరుగా మారిపోయింది. షాజాహానా కవి త్వంలోని వస్తు రూపాలు దేనికవే పోటీ పడుతు న్నట్లుగా ఉంటాయి. ముస్లిం ఈస్థటిక్స్‌ని తెలుగు కవిత్వంలోకి షాజాహానా తనకు తెలియకుండానే ప్రవేశపెట్టింది. కొత్త కవి సమయాల్ని, కొత్త అభి వ్యక్తిని గొప్ప కవితా శిల్పంతో షాజాహానా తెలుగు కవిత్వానికి నజరానా చెసిందని చెప్పడం అతిశ యోక్తి కాదు. ‘అనార్కలి’ పర్దా హటకే దేఖో’ ‘ఖబ డ్దార్‌’ ఖౌసెఖిజా’  దూస్రా ఆస్మాన్‌’ వంటి లాజవా జ్‌ కవితలు రాసింది. షాజాహానా కవితా నిర్మా ణం ఉర్దూ కవిత్వ స్థాయిలో ఉంటుంది. ఎత్తుగడ, ముగింపు, నిర్వహణ అంతా కళాత్మకంగా కరుణా త్మకంగా ఉంటాయి. ఆమె కవితాశిల్పి విషయాన్ని మింగెయ్యదు. మరింత ఉద్దీపనం చేస్తుంది. అనా ర్కలి భగ్న ప్రణయ విషాద గాధ లోకానికంతా తెలుసు. అయితే అనార్కలీ వారసులు ఇంక లో కంలోఉన్నరాంటుంది కవయిత్రి.నిర్భంద ముస్లిం స్త్రీలకీ నిగూఢ ముస్లిం యవతులు నిర్మల ప్రేమ లకీ ప్రతీకగా ‘అనార్కలీ’ కవిత పుట్టిందని తెలు స్తుంది. ‘పరదా’ పద్దతి మీద ముస్లిం స్త్రీవాదం పెద్ద యుద్దమే ప్రకటించింది.ఊహ తెలియని వయసులో/ గుమ్మానికి పరదా కడితే రంగు రంగుల కుచ్చులు చూసి మురిసి పోయినదాన్ని అప్పుడే స్వేచ్ఛకి మొదటి బేడీ అని తెలుసుకోవాలే పసిదాన్ని గుమ్మనికి కట్టినట్టే అమ్మ ముఖానికి బుర్ఖా కడితే స్వప్నంలాంటి జందగీకి శాపమని తెలియనిదాన్ని…మీరు బిగించిన ఇనుప సంకెళ్లని విదిల్చేయగల గుండెదైర్యం నాకు చాలా వుంది.. అంటూ నిర్భయంగా తన తిరుగుభాటుని ప్రకట ిస్తుంది.’దూస్రా ఆస్మాన్‌’ ఆమె రాసిన గొప్ప దు:ఖ కవిత. వాస్తవిక జీవితానికి దగ్గరయిన విషాద వస్తువు. భర్త డబ్బు సంపాదనకోసం అరబ్బు దేశా లకెళ్లాడు. సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపో యారు. ఇక్కడ స్వదేశంలో ఉగ్గబట్టిన భార్య మనో వేదనను అనితర సాధ్యంగా షాజాహానా కవిత్వక రీంచింది. హైదరాబాద్‌ పాతబస్తీల్లో చాలా ఇళ్లల్లో కనిపించే సన్నివేశమే ఈ కవితాసారం.”నవ్వు పంపే కరెన్సీ కాయితాలకు నీ స్పర్శెలా వస్తుంది ప్రతీ రాత్రీ ఖాళీగా వెక్కిరించే సగం పక్క ఏ రెండు మూడేళ్లకో/ నువ్వోస్తున్న కబురు రోహిణి తర్వాత భూమి ఆకాశం వైపు చూసే చూపు నాది..నీ ఎన్ని రాకలకి చల్లబడతానో…. ప్రతీసారీ ఆకాశాన్ని చీల్చుతూ పైకెగిరే నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడూ కిటికీ కవతల శూన్యం నింపుకున్న రెండో ఆకాశం… భార్యభర్తల సంబందాల్లోని సుదీర్గ విర హ విషాదానికి దుర్భర దు:ఖ ప్రతీక ఈ కవిత ప్ర పంచంలోని ఏ స్త్రీ మూర్తికైనా ఈ ఖండిక అన్వ యింస్తుంది.షాజాహాన రాసిన ప్రతి కవితా విలక్ష ణమైంది. విశిష్టమైంది. కవిత్వంలేని వాక్యాన్ని షా జాహాన రాయదు. ఆమె కవిత్వాన్ని అంచన కట్టే ముందు అసలు కవిత్వం గురించి తానేం చెప్పిం దో ఆ మాటలు ఆమె కవిత్వానికి కూడా సరిపో తాయి.’ ఇప్పటి కవిత్వం జీవితాన్ని కవిత్వంలో పరుస్తుంది. ఇప్పుడు కవిత్వమంటే లైవ్‌ టెలికాస్ట్‌ ‘షాజాహానా ముస్లింవాద కవిత్వానికి షామియానా వేసింది. మరెందరో కవయిత్రులకు అందులో చో టు ఉంటుంది.షాజాహానా తర్వాత వినిపించిన పేరు షంషాద్‌ బేగం. గుగ్గిలంలాంటి కవితా రాసి ముస్లిం షరియత్‌లో పొగలు పుట్టించింది. ఆషా డంలో పుట్టిల్లుకు చేరిన నా సహేలీలు ముగ్గురు రాబోయే శ్రావణం గురించి మురిపెంగా ముచ్చట్లాడుతుంటే అనిపిస్తుంది. తల్లాఖ్‌ ఇవ్వబడ ిన నవాబుగారి బీవీనయినందుకు ఆరేళ్లుగా నాకు మిగిలిందిఆషాడమేగా…నాపర్సనల్‌ లాను ప్రశ్నిం చడానికి నేనే మౌన పోరాటానికైనా సిద్దమే..అని ముస్లిం స్త్రీలలో జడత్వంలోంచి జూలు విదిలించే ప్రకంపన పుట్టించింది. ఆధునిక తెలుగు కవిత్వం లో విప్లవ, ధళిత స్త్రీవాదం కూడ కొత్త గాలుల్నీ కొత్త ఆలోచనల్ని కొత్త ద్వారాల్నీ తెరిచింది. తెలుగు కవిత్వాన్ని తేజోవంతం చేసింది. ముస్లిం వాద కవిత్వానికి స్త్రీ ప్రతినిధిగా షాజాహానాని విధిగా గుర్తించాల్సి ఉంటుంది.

-ఎండ్లూరి సుధాకర్‌

మతం మార్పిడి

తమిళనాడులోని తిరునల్వేలి మొదలయిన జిల్లాల్లో హరిజనులు ముకుమ్మడిగా ముస్లింలైపో తున్నారన్న వార్త వెలువడగానే కేంద్ర హోంశాఖ  సహాయమంత్రి మక్వానా. ఆర్యసమాజ్‌ వంటి ప లు హిందూ సంస్థల ప్రతినిధులు అక్కడికి పరుగె త్తారు. రకరకాలుగా వినవస్తున్న ఈ వార్తల్లో నిజా నిజాలు తెలుసుకోవాలంటే ముస్లిం మతం స్వీక రించిన హరిజనులనూ, తోటి గ్రామస్తులను కలు సుకోని మాట్లాడాలి.వెళ్లి మాట్లాడితే విషయాలు క్లుప్తంగా ఇవి మతాంతరీకరణ ముమ్మరంగా సాగుతున్న మాట నిజం ఇటీవలనే రామనాథ పురం జిల్లాల నూరుహరిజన కుటుంబాలు ఇస్లాం చంద్రవంక పతకచ్చాయ కింద చేరాయి. హిందూ మత దరాన్యాయల నుంచి బయటపడేందుకు, తా ముఅన్నమతం స్వీకరించామని వారంతా అంటు న్నారు. ముస్లింలు నన్ను తమతో సమానంగా చూస్తారు. అందువల్ల నేను ముస్లినయ్యాను అన్నా డు సయ్యద్‌ మహమ్మద్‌. రామనాథపురం జిల్లా అతియూతు గ్రామంలోని ఈ హరిజనుని పేరు, పూర్వాశ్రమంలో ‘సేతు’ఇలాంటి వాళ్లంతా ఇస్లాం ను స్వీకరించడమే కాదు, మిగిలిన హరిజనుల్ని దాంట్లోకి రమ్మని విజ్ఞాప్తి చేశారు.తిరునల్వేలికి సమీపంలోని అతియూతు అనే గ్రామంలో టెరికా టన్‌ షర్ట్‌, కొత్త ముస్లిం టోపి ధరించిన ఒక యు వకుడు ఇలా వివరించాడు. హిందూ మతమంటే నాకు ఆసహ్యం. మమ్మల్ని దేవాలయాల్లోకి రాని వ్వరు. కానీ ఇస్లాంలోవున్నది ఒకే దెవుడు. మేము కలవాళ్లమైనా, లేనివాళ్లమైన మసీదులో మమ్మల్ని సమానంగా చూస్తారు. అంతేకాక, హిందువులు మమ్మల్ని పంక్తిలోకి రానివ్వరు కానీ ముస్లింలూ నేనూ ఒకే పంక్తిలో తింటాం. వాళ్ల ఇళ్లల్లోకి స్వే చ్చగా వెళ్లవచ్చును.. మతం మార్చుకున్నందుకు తమకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదు. తామే చేతి నుండి ఖర్చు పెట్టుకున్నామని అతనన్నాడు.ఘనత వహించిన హోంమంత్రి మక్వానా గారు మతం మారిన వారిని ప్రశ్నించినప్పుడు వారిలా అన్నారు: మేం ఇస్లాం మతం పుచ్చుకొనక పూర్వం మమ్మ ల్ని బస్సుల్లో ప్రయాణం చేయనివ్వలేదు.అధవా బస్సు ఎక్కినా కొట్టి దించేసేవారు. ఇస్లాం స్వీకరిం చిన తార్వత మమ్మల్ని లే అనడానికి ఎవరికీ దమ్ముల్లేవు….మా హరిజన కులస్తులు చనిపోతే శవాలను ధేవర్స్‌ నివసించే వీధుల గుండా శ్మశా నికి తీసుకపోనిచ్చే వారు కాదు. మతం మార్చు కున్న తరువాత మా గుడెంలో ముసలమ్మ చని పోతే పొరుగూళ్ల నుంచి ముస్లింలు వచ్చి ఆమె శవాన్ని ఊరేగింపుగా మసీదుకు తీసుకపోయి ఖన నం చేశారు. మేము తిన్న కంచాలలోనే వారు భోజనం చేశారు. ఇది హిందువులు చేసేవారా?..

తర్వాత నేను ఇలా అడిగాను: మీరు తిరిగి హిందూమతం స్వీకరిస్తారా? వెన్వెంటనే సమాధ నం వచ్చింది.: మళ్లి మమ్మల్ని హరిజనులు కమ్మాంటారా..?

బువ్వమ్మనూ వినండి విననివ్వండి

పీర్ల పండుగనాడు మా బతడికాడ శిగమెత్తి ఊగి పోయో బాలపీర్లూ ఖాదర్‌ పాషా దర్గాకాడ మలి దాకోసరంఎదురుజూస్కుంట కూసున్నపకీ రోల్లూ రంగుల పండుగనాడు రంగుల్లో తాను మునుగు తూ మమ్మల్ని ముంచేసే మా పక్కింటి చాంద్‌బీ, ఆమె రంగుల నవ్వూ బురకా ఏస్కోని తిరగమని గులుక్కుంటా తిరిగే సులేమానూ- మూనెల్లకోసారి డబ్బీల నిండా కాటుకతో పైనిండా కర్పూరం వాత సన్లతో కాటుక్కళ్లతొ పల్కరించే బువ్వమ్మా పంచ రంగుల గాజుల్తో ఆకాశంమీది ఇంద్రుని ధనుస్సు బుజాన తగిలించుకుని మా ఆడపిల్లల్నందర్నీ మా యజ..ఏసే అతిలోకవీరుడు గాజుల సాయోబూ రంగుల్ని కంబళ్లపై పూవులుగా పూయించే మోలి సాబు ఇదంతా నా ఐదారేండ్ల మోటు చిన్నతనం ఇంకా సోగసుబాటల చదువులు సోకనికాలం కా లం జరూరుగ ముందుకే కదిలింది అ అమ్మ అలీ ఫ్‌ బేబే తేల నుంచి అ అంటే అబివృద్ది దిశలోనే ముందుకు సాగిరతంది ఇప్పుడు సేమ్యాలు కుండ మీద గాకుండ మిషిని తిప్పి చేయుడు నేర్చుకుంది మా చాంద్‌బీ, మరింత సైగ్గా బరకా లేకుంట వాయె నెత్తిమీద కొంగేసుకుంటేమైతదని దీర్గాలు తీస్తనే ఉండు సులేమాను తుర్కోల్లంటే తుర్కగేరోల్లే అప్పటికి  తుర్కోల్లతో సోపతేందని వ్వరడగలే నన్ను. బల్ల గజినీ మొహమదు చరిత్ర పాటల్లో ఎదురయ్యేంత మాటకు. గునళ్ల ఇరిగిపోయిన రా ముని దనుస్సును తల తెగిన రాజునూ, మక్కు తెగ్గోసిన సీత బ్మోనూ జూపి, ముసల్మానుల దురా గతాలను మా నాగలక్ష్మి టీచర్‌ చెప్పినప్పుడు మొద టిసారిగా దోస్తులం అనుమానం కళ్లతో అవమాన పడ్డాం. కుంగుతున్న సూర్యుని దిక్కుగా బండాయ గనఱుట్టకు రోజూమేంచేసే షికార్లలో మా దోస్తూ హస్నుద్దీన్‌ను గుట్టకిందనే ఆగిపోచేబీపటట్టు చే సింది మా హైస్కూలు గ్నానం. బేస్తవారం ఖాదర్‌ ఫాషాదర్గకుపతేహకోసరంపంపే హలీదా తయారు జేసే ఫార్ములా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటని. మాకు ఆధునిక తర్కం ఇచ్చిన ధీమా పడికట్టు ఆలోచనలను ప్రకృతి యైన భాషలో నేర్చుకోని బువ్వమ్మానూ, చాంద్‌బీనీ, మోలీసాబ్‌ లనే గేలలిచేస్తూ గెలిగిస్తూ తరిగే మా దోస్తులు రామేశ్వరూ, గోవిందూ.

-వేముల ఎల్లయ్య,స్కైబాబ

ఇంకావుంది…