తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

దళిత, ముస్లిం స్పృహలకి ఒక మౌలికమైన తేడా ఉంది. వాటిని దళిత మార్కిస్టు దృక్పతం నుంచి పరిశీలించడం ఈ వ్యాసం ఉద్దేశం. దళిత స్పృహ కోరేది ఆత్మగౌరవం. మైనారిటీ స్పృహ ఆశించేది ఆత్మరక్షణ. వీరిద్దరి మధ్యా సమన్వయం సాధించాలనుకునే ప్రయత్నాలకి ఈ తెలివి అవస రం.దళితస్పృహచాలా మట్టుకు స్వచ్చందం, మైనా రిటీ స్పృహ చాలావరకూ బయటివారు రుద్దినది. ఉపన్యాసాలలోనూ విద్యావంతుల రాతలనీ చూస్తే ఈ రెండు బృందాలవారికీ ఒకరే శత్రువనే భ్రమ కలుగుతుంది. ఆ భ్రమ రాతల్లోనే గానీ చేతల్లో లేదు కాబట్టి బహుజన సమాజ్‌ పార్టీవారు ఏ సం కోచం లేకుండా బిజేపీతో జట్టుకట్టారు. ఆ పార్టీ భావజాలాన్ని ఎత్తుగడలని ఆంధ్రదేశంలోనూ దళి త మేధావులు ఆదర్శంగాతీసుకుంటున్నారు.దళిత స్పృహకీ ఇతర ఉద్యమాలన్నిటికీ ఒక ముఖ్యమైన తేడాఉంది.ఏ ఉద్యమమైనా చైతన్యమైనా పైకి ఎది గివచ్చే ఏ సమిష్టి ప్రయత్నమైనా చరిత్రని ఒక ప్ర త్యేక పద్ధతిలో వాఖ్యానించుకుంటుంది. చరిత్ర పొ డుగునా సాధికారత కోసం వనరుల వాటా కోసం గౌరవంకోసం జరిగిన ప్రయాత్నాలన్నింటా ఓక సాధారణఅంశంకనిపిస్తుంది.గతంలోతమ బృందా నికి ఒక స్వర్ణయుగం ఉండేదనీ కనీసం పరిస్థితి మెరుగ్గ ఉండేదనీ ఏవో కారణాల వల్ల ఇప్పుడు పరిస్థితులు దిగజారాయనీ గత వైశవాన్ని పునరు ద్ధరించడమే ప్రస్తుత కర్తవ్యమనీ ఆ మృందాలు త మ చరిత్రకి హాషయం చెప్పుకుంటాయి. పైకి వచ్చేఅయ ప్రయాత్నాలకి ఒక ఊపుని ఉద్రేకాన్నీ తెగింపుని కల్పించడానికి ఈ వ్యాఖ్యానం తోడ్పడు తుంది. తరచూ వారి ప్రయాత్నాలకి అడ్డంకులని పటుట్టదలగా తొలగించుకోవడానికి అవసరమైన త్యాగాలని చేయడానికి చారిత్రక అన్యాయం అనే భావన ఎంతో అవసరం అవుతుంది. ఈ మొత్తం వ్యవహరంలో ఆ చారిత్రక వాఖ్యానం ఎంతవర కూ నిజం అనేది అనవసరమైన విషయం.దళిత స్పృహ వరకూ వస్తే పరిస్థితి సరిగ్గా తలకిందులు. దళితుల మనసుల్లో చాలా బలంగా నాటుకుపో యిన ఒక చారిత్రక చట్రం ఉంది. దాని ప్రకారం గతంలో తమ పరిస్థితిరత మరింత దారుణంగా ఉండేది. కనీసమానవ హక్కులు సరే మానవ హోదా కూడా ఉండేది కాదు. ఇప్పుడు పరనిస్థితి మరికాస్త మెరుగుపడింది ఇంకా మారాల్సినది ఎంతోఉంది.ఈ అబిప్రాయం చాలా వరకూ తప్పు అదలా ఉండనిస్తే దళిత స్పృహలో పదును లేకపో వడానికి ఈ రకం చరిత్ర వ్యాఖ్యానం కారణం. గో ప్పగా బతుకుతు ఉండిన తమని ఎవరో ఒకరు ఓడించో మోసం చేసో దిగజారారనే ప్రచారం లేకుండా ఏ ఎత్నిక్‌ ఉద్యమమూ సమరశీలమైన పోరాటం చేపట్టలేదు. అందకే దళితుల రాజకీయ బలంవారిజనాభానిష్పత్తితోపోలిస్తే చాలా బలహీ నంగా ఉంటుంది. దళితుల మీద దళిత నాయక త్వం పట్టు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దళిత స్పృహలో కసి ఉండదు. ఇదొక్కటే కారణం కాదు గానీ ఈ చారిత్రక దృక్పథం దళిత రాజకీ యాల తీరుతెన్నులని నిర్ణయించే ఒక ముఖ్యమైన అంశం. ఈ చారిత్రక చట్రం దళిత జనుల మన సుల్లో బలంగా నాటుకుపోవడానికి తొలికాలం నాటి చరిత్ర రచతనననలూ ప్రాచీన కాలంనుండీ దళితులకు జరుగుతూ వచ్చిన అన్యాయాల గురిం చి దళిత నాయకత్వం  చేసీన ప్రచారమూ కొంత వరకేకారణాలు.చెవుల్లో సీసం పోయడం గురించి ఇప్పటికీ వీదుల్లో దళిత నాయకుల ఉపన్యాసాల్లో ప్రతిసారీ వింటుంటాం. మనువు చెప్పిన సూత్రాల గురించీ తరుచూప్రాస్తావన వస్తుంటుంది.ఆ ధర్మ శాస్త్రాలు ఎంతవరకు అమలయ్యాయి? వాటి పట్ల దళితులు ఎలా స్పందించారు అనే ప్రశ్నలు గానీ అసలు చాతుర్వర్ణ ధర్మం అని శాస్త్రాలలో పదేపదే వినిపించే మాటలకీ అప్పటి వాస్తవాలకీ సోంతన ఎంత ఉండేదీ అనే ప్రశ్నలు అసలు ఎవరూ అడగ రు.ఈ విషయం మీద జరిగిన చారిత్రక పరిశోధ నలు ఎందుకో గానీదళితమేధావుల్లోసైతం చర్చకు రావు. ఇదంత చెప్పడమెందుకంటే, దలిత స్పృహ కి ఆధారమైన చరిత్ర వాఖ్యానం కసినీ, పోరాట శీలతని  కలిగించలేదని తేల్యిచెప్పడానికే. అందు కే దళిత ఉద్యమం ఇప్పుడు ఒకప స్దుకుపోయే ఉద్యమం.దళితులుచాలా కాలంగా వెలివేయబడిన సమాజంకాబట్టివారిడిమాండ్‌లలో మమ్మల్ని కలు పుకోండి అనే కోరికా సంసిద్ధతా చాలా బలంగా ఉంటాయి. అందుకు ముందుకు వచ్చేవారి దురు ద్దేశాలు స్పష్టంగా కనిపించిపోతున్నా పట్టించుకో కుండా వాటేసుకునే ధోరణి దళితులలో హెచ్చు. ఈ ధోరణినీ ముస్లిం స్పృహని ఎలా అంచనా వేయాలన్న  ప్రశ్ననీ కలిపి పరిశీలించాలి.హిందూ ముస్లిం ఐక్యత అనే భావనకి పెద్ద చరిత్ర లేదు. హిందూ అనే కుల విభజనలని విస్మరించే భావన స్థిరపడింది ఈ మధ్యనే . ఆ తర్వాతే వాటి మధ్య ఐక్యత అనే అంశం రాజకీయ ఎజెండాలోకి వ చ్చింది.అప్పటికి బ్రిటిష్‌ ఇండియా అనే పాలనా యూనిట్‌ ఏర్పడింది గానీ భారతదేశం, జాతి అనే భావనలు ఇంకా పుట్టనైనా లేదు. ఉనన్నత ప్రభు త్వోద్యా గాల లోనూ మరికోన్ని వనరుల పోరు లోను కులీన వర్గాల మధ్య పోటి హిందూ, ము స్లిం లేబిల్లని పుట్టించింది. అలాంటి వర్గీకరణకి ఆయా వర్గాలతో సాటు వలసవాదుల మతిలేని వర్గీకరణ దృక్పథం కొంత కారణం. వఅప్పుడే హిందూ ముస్లిం ఐక్యత అనే భావన కూడా పుట్టిం ది. వనరుల మీదా అవకాశాల మీదా జరిగిన ఈ పోటి కులీన వర్గాల సమస్య ఐక్యతా ప్రయాత్నాలు కూడా వారి మధ్యే జరిగాయి.అదే సంప్రాదాయం ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికి హిం దూ ముస్లిం ఐక్యతా ప్రయత్నాల ఫేవరెట్‌ మార్గ మై కూచుంది. దీనికంటే దళితులు ముస్లింలు గొడ్డుమాంసాన్ని కలిసి తినే వేడుకలు జరపడం ఇంకా మెరుగయిన శక్తివంతమైన పద్దతి. దీన్ని ఎంచుకున్న సంధర్భాలు చాలా అరుదు.

గతంలో నాజిజయూ రకరకాల ఫాసిస్టు ఉద్య మాలూపుట్టుకువచ్చినప్పుడువాటిని ఏదో ఒక వరా ్గనికో కొన్ని కర్గాలకో ముడిపెట్టి వివరించాలనే ప్ర యాత్నాలు జరిగాయి. అలాంటి తప్పుదోవ పట్టిం చే సూత్రీకరణలుచేసిఆ ఉద్యమాలకి అధికారాన్ని కట్టమెట్టి దారుణ మానవవిధ్వాంసాలకి వాటిని  పాడనిచ్చాయి. ఇక్కడ కూడా సంఘ్‌ పరివార్‌ రాజకీయాలని ఏవో కొన్ని కులాలకి ముడిపెట్టి అ ర్థం చేసుకోవాలనే మూర్ఖ ప్రయత్నాలు చాలాకా లంగాజరిగాయి.అందువల్ల సంఘ్‌ పరివార్‌ని ఆది óపత్యం కులాలతిఘాత విప్లవంగా చాలామంది చూస్తున్నారు ముంస్లింలని క్రైస్తవులనీ తప్పించి జైన,బౌద్ద,సిక్కు మతాలతో సహా ఒక విశాల హిం దూజాతిని నిర్మించే ప్రయత్నంగా చూడటం లేదు. అందుకే దళిత ముస్లిం క్రైస్తవ ఐక్యతమీద చాలా మందికి అతి అంచనాలు ఉన్నాయి. దళిత నాయ కుల బ్రహ్మణ, హిందూ వ్యతిరేక ష చాలా తప్పు దొవపట్టిస్తున్నది.సంఘ్‌పరివార్‌కి విశాల హిందూ ఐక్యతకావాలి.కులంఅడ్డుతొలగాలి.కుల నిర్మూలన కమ్యూనిస్టుల కంటే అంబేద్కరిస్టుల కంటే సంఘ్‌ పరివార్‌కే ఇప్పుడు ఎక్కువ అవసరం.హిందూ ఐడెంటిని భారతీఆయతనీ ఒకటే అన్నట్టు చూపిం చిముస్లిం,క్రైస్తవ సమాజాలని ఆ నిర్వచనం నుంచి తప్పించడం వారి ఆశయం, లక్ష్యం ఆధిపత్య కు లాలు చాలాకాలంగా పన్నుతున్న ఎత్తుగడలనే అనుకరించి అధికారాన్ని చేజిక్కుచుకుంటున్నా మనీ ఆ విషయాన్ని ఆత్మవంచన లేకుండా భాహా టంగా ఒప్పుకుంటున్నామనీ దళిత రాజకీయ నేత లు అంటుంటారు. కానీ సంఘ్‌పరివార్‌ శక్తులు కల్పిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకోవడం తప్ప అది మరేం కాదు.ఈ చేదు నిజాలని అర్థం చేసు కోవడానికి సిద్ధపడకపోతే, దళిత ముస్లిం ఐక్యత కోసం ఆచరణయోగ్యమైన ప్రణాళికని రూపోం దించుకోలేం అలాంటి ఐక్యత లేకుండా అపాయం లో పడ్డ ఇండియన్‌ ముస్లిం, క్రైస్తవుల ఫ్రాణాలని కాపాడటం వీలుకాదు. ఈ మధ్య ప్యాపిలిలో దళి తుల మీద బీ.సీలు జరిపిన దాడిని తప్పుడు భావ జాలంగానో అరుదైన దుర్ఘటన గానో వాఖ్యానిం చబోయిన బీసీ మెదావుల్ని దళిత మెధావులు సరి గ్గానే నిలధీసారు. దళిత బహుజన ఐక్యత అనే భావనలోని కప్పదాట్లని ఎత్తిచూపారు.మరి అదే దళిత మేధావులు సంఘ్‌పరివార్‌వారి దాడులలో హత్యాకాండలో ఆదివాసులూ ఇతర దళితులు పాలుపంచుకోవడం గురించి అడిగితే ఏమి చెబు తారో చూడాలి.

-వేముల ఎల్లయ్య,స్కైబాబ

ఇంకావుంది…