తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 9th

అందరిలోని ‘హిందూత్వ అంశ’ బయటపెట్టిన ముస్లిం మైనారిటీ వాదం
స్త్రీవాదం కానీ, దళితవాదంకానీ, స్థానికతావాదం కానీ పూర్తి సమ్మతి పొందాయనుకోవడం ఒక అబి óప్రాయం మాత్రమే. మైనారిటీ వాదానికి ఏమాత్రం సమ్మతి లేదనుకోవడమూ ఒక అభిప్రాయమే. వాటిని నిర్ధారించడానికి కొలమానాలు ఏవి లేవు. ప్రతివాదమూ తన పద్దతిలో ‘తన-పర’ లను నిర్వ చిస్తుంది. మైనారిటీవాదాన్ని సమర్థించి, సానుభూ తి చూపే అనేకులు ఇతర వాదాల్ని అసహనంగా, అసభ్యంగా విమర్శించడం తెలిసిందే. అయితే మైనారిటీవాదం రంగంమీదికి రాగానే-మైనారిటీ అస్తిత్వానికి వెలుపల ఉన్నవారందరిలోని ‘హిం దూత్వ అంశ’ బయటికి వచ్చింది.(దళితవాదం తక్కినవారిలోని బ్రహ్మణవాదాన్ని, స్త్రీవాదం తక్కి నవారిలో పురుషాహంకారాన్ని వెలికి తెచ్చినట్లు) జనసంఖ్యరీత్యా మైనారిటీలు కానివారు ఎక్కువ కాబట్టి, మైనారిటీవాదాన్ని సానుభూతితో చూసే వారు కూడా అతి తక్కువగా ఉన్నారు. ఆ కారణం గానే మైనారిటీవాదాన్ని ‘సమ్మతి’ దొరకలేదనే అబి óప్రాయం లుగుతున్నది.
చైతన్యవంతులైన వారిలో పురుషాహంకారం, వర్గాహంకారం, కులాహంకారం, ప్రాంతీయ పె త్తందారీతనం మైదలైనవన్నీ అవశేషాలుగానో, నిగూఢాంశాలుగానో ఉన్నట్టే ‘హిందూత్వ’ కూడా ఉన్నది. అందులో ఆశ్యర్యపడవలసినది ఏమిలేదు
గుజరాత్‌లో ముస్లిమ్‌ల ఊచకోత-ఒక సంఘ ట న మాత్రమే కాదు. అది ఒక పెద్ద క్రమంలో అంతర్భాగం. ముస్లిమ్‌లకు విజాతీయులుగా, విదే శి ఏజెంట్లుగా, దేశ విచ్ఛిన్నకులుగా, హింసాదాధ కులుగా చిత్రించడం హిదూత్వ ఫాసిస్టు శక్తులు పనిగట్టుకుని చేస్తు వచ్చారు. స్వాతంత్య్రానంతరం కూడా ఒక పరంపరగా సాగూతూ వస్తున్న హింసాకాండలో అత్యధికంగా బాదితులైన ముస్లి మ్‌లలో కూడా సహజంగానే ప్రతిఘటనాతత్వం పెరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా బాబ్రీమసీదు అంశం ముస్లీమ్‌ ఆత్మగౌరవ అంశంగా పరిణ మించింది. కాశ్మీర్‌ జాతీయతావాద ఉద్యమమే అయినప్పటికీ, భారత పాలకవర్గాలు దాన్ని పని గట్టుకుని మత ఉద్యమంగా మార్చివేశారు. ఇప్పు డు దేశంలోని వామపక్ష విప్లవకారులు, ఈశాన్య భారతంలోని జాతివిముక్తి పోరాటకారులు తప్పిం చి, దేశంలో ప్రతిఘటనకారులందరూ ముస్లిమ్‌లు కావడం గమనించవచ్చు. ఈ పరిస్థితికి విద్వేష పూరిత ప్రచారాన్ని జోడించి హిందూత్వ ఫాసిస్టు లు సమాజంలో ముస్లిమ్‌ వ్యతిరేకతను పెంచుతూ వస్తున్నారు.ముస్లిములనే బూచిని చూపిస్తూ ఉన్మా దాన్ని పెంచడం, గుజరాత్‌ వంటి ‘ప్రయోగాల’ ద్వారా విశాల ముస్లిమ్‌ ప్రజానికాన్ని అణగిమణగి ఉండే తక్కువ స్థాయి పౌరులుగా మార్చడం-ఫాసి స్టుల ఎత్తుగడ.
ముస్లిమ్‌ వ్యతిరేకతను తగ్గించేందుకు సంస్థలు, వ్యక్తులు ఎవరూ కృషిచేయడం లేదనుకోవడం అ న్యాయం. ఆ కృషి ఇంకా బలపడాలని అనడం వేరు. ఏ కార్యచరణ లేకుండా రంధ్రాన్వేషణ చేసే వారిని కాకుండా, ఈ దేశంలో ప్రభుత్వంతో, వ్యవ స్థతో తీవ్రమైన ఘర్షణలో ఉన్న ముస్లిమ్‌ పోరాట కారులెవ్వరినైనా అడగండి, ముస్లిమ్‌ సమాజంలో కానీ, మొత్తం భారతీయ సమాజాలలో కానీ సదవ గాహన, సామరస్యం కోసం పనిచేస్తున్న ముస్లిమ్‌ సామాజిక కార్యకర్తలెవరినైన అడగండి-వారేచె బుతారు. ఎందరు వ్యక్తులు, ఎన్ని సంస్థలు వారి కి అండగా ఉన్నారో, ఉన్నాయో. మొత్తంగా ప్రపం చవ్యాప్తంగా, ఉదారవాదానికి, మధ్యేమార్గానికి కాని కాలం వచ్చింది. ఉదారవాదులకు, సౌమన స్యవాదులకు విలువ తగ్గిపోయింది. అటువంటి వారి ప్రయత్నాలు అరణ్యరోదనలుగా, శుష్కమైన విగా పరిగణించడం పెరిగిపోయింది. అందువల్ల భారతీయ సమాజాలను ‘అందరి’ సమాజాలుగా, జనబలాన్ని సమకూర్చుకో లేకపోతున్నాయి. పార్ల మెంటుమీద దాడి కేసులో అక్రమంగా ఇరికించిన ఢిల్లీ యూనివర్సిటీ లెక్చరర్‌ జిలాని విషయంలో మొత్తం రాజ్యవ్యవస్థే కర్కశంగా వ్యవహరించిన, ఒక రామ్‌ జెత్మలానీ, ఒక నందితా హక్సర్‌, ఒక కన్నాభిరాన్‌ అతనికి అండగా నిలబడడానికి సం కోచించలేదు. అన్యాయంలో భాగంకాలేక గుజరా త్‌లో ఒక ఉన్నతాధికారి హర్ష్‌మందర్‌ పదవినే వదిలివేసి తన వైఖరిని నిర్భయంగా ప్రకటించాడు అటువంటి వారి వ్యక్తిత్వాలను కించపరచకూడదు వారి కృషి ఫలించకపోవడం, ఒక గట్టి శక్తిగా పరి ణమించకపోవడం వేరే విషయం. అందుకు కార ణాలను విడిగా అన్వేషించాలి. ముఖ్యంగా బాధితు లు నిస్పృహల నుంచి జనించిన నిర్ధారణలకు రాకూడదు. వారినుంచి దాన్ని ఆశించడం న్యా యం కాదు, కానీ, వారి క్షేమం, వాదరి భద్రత, వారి భవిష్యత్తు కోసమే- వారు ఆశను విడనాడ కూడదు ..
-కె.శ్రీనివాస్‌
హిందుత్వకు విరుగుడు హేతువాదం కాదేమో?!
దళిత స్త్రీ వాదాలను కూడా తెలుగు సాహిత్యం అంత సులభంగా స్వీకరించలేకపోయింది. ఏ వా దమైనా మొదట ప్రతిఘటనను ఎదుర్కొవలసే, ఘర్షణ పడాల్సే ఉంటుంది ఇందుకు ముస్లిం వా దం మినహాయింపేం కాదు .అయితే స్త్రీ వాదానికి ,ధళిత వాదానికి ఉన్న సృష్టమైన లక్ష్య నిర్దేశం ముస్లిం వాదానికి లేదేమో అని అన్పిస్తుంటుం ది.ముస్లింవాదం ఇప్పటి వరకు వివక్ష ,దళితుల పట్ల స్త్రీల పట్ల వివక్ష లాగా పైకి కనిపించేది కా దు. ముస్లింల పట్ల వివక్ష నిజానికి అంత కన్నా దారుణంగా ఉంది.అయితే దీన్ని అర్థం చేసుకో వాడానికి కొంత విశాల దృష్టి అవసరం.అలోచనా సరళి కూడా కొంత మార్చుకోవడం అవసరం దీన్ని సాధించాడానికే ఎక్కువ సమయం, కృషి అవసరం . ఈ క్రమంలో జరుగుతున్న ముస్లిం వాద సాహిత్య కృషి ఆదరణ పొందుతున్న సూచన లు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి.
చైతన్య వంతులనుకునే వాళ్లు మత తత్వానికి హేతు వాదాన్ని , నాస్తిన్ని విరుగుడని అనుకున్నా రు,అనుకుంటున్నారు . హేతు వాదం ఆ పని చే యలేకపొయింది.దీనికి కారణలు అనేకం మూలా ల్లొకి వెళ్తే తప్ప దీన్ని విశ్లేషించలేము.హిందు మ త్వాన్ని సీక్వరించడానికి ప్రతేక్యమైన పద్దతు లేమి లేవు. ఇప్పటి రాజకీయ చెప్పే ‘హిందూత్వ కు ప్రా తిపదిక లేదు , మత లక్షణాలు లేవు .దీనికి కుల ప్రాతిపదిక మాత్రమే ఉంది. బ్రహ్మణీయ భావజా ల కర్తలు మిగతా కులాలన్నింటిని తమ అధిప త్యం కొసం కూడగట్టుకొవడానికి ‘హిందుత్వ’ కా ర్డుని వాడుకున్నారు, ఆ రకంగానే ‘హిందుత్వ ‘ అనేది ఇవాళ ప్రజల్ని కూడగట్టడానికే , వ్యతిరే కించడానికే వాడుతున్న ఒక రాజకీయ నినాదం మాత్రమే ,జీవన విధానాన్ని , జీవన శైలిని పరిగ ణనలోకి తీసుకుంటే దానికి ప్రత్యేక అస్తిత్వం ఉన్న ట్లు లేదు. జీవన విదానాన్ని మార్చుకోవడమే ‘హిందుత్వాన్ని’ వ్యతిరేకించడ మవుతుంది. ఈ కృ షి సాంస్కృతిక రంగాల్లో జరగాల్సి దళిత , స్త్రీ వాదానికే ఎక్కువ అవసరం.
ప్రత్యామ్నాయ రాజకీయాలు గాని,పజాస్వామిక ఉద్యమం గాని అటువంటి నిర్మాణాత్మక కృషి చేయలేక పోయాయి.కమ్యూనిస్టు ఉద్యమాలు వెనుకబడి పొవడానికి , సంఘం పరివార్‌ రాజ కీయ నేడు దేశాన్ని పాలించే స్థితికి రావడానికి కారణం అదే . గుజరాత్‌ ఊచకొతకు పునాది కూ డా ఇదే అన్ని సామాజిక సంఘ పరివార్‌ ‘హిందూ సంస్కృతి కొద్యమాన్ని తక్కువ చేసి పని చేయడం వలననే అనుకుంటున్నాను.
ముస్లిం వ్యతిరేకతను పొగొట్టే ఇప్పటివరకూ పని చూస్తూ ప్రగతిశీల ఉద్యమాలు విడిగా చేపట్ట లేదు .విడిగా చేపట్టాల్సిన అవసరం ఉన్నదని కూ డా అవి భావించినట్లు లేదు. సంఘ పరివార్‌ శక్తు లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు ప్రచారం సాగిస్తున్నాయి.ముందే అనుకున్నట్లు ‘హిందుత్వ ‘ శక్తులు సాంస్కృతిక రంగంలో చేసిన , చేసున్న కృషికి విరుగుడు హేతు వాదమనే ఉద్దేశ్యం బలం గా ఈ ఉద్యమాలకు ఉంటూ వచ్చింది.అది తప్ప ని కూడా చెప్పలేము.అయితే దానికి పరిమితు లున్నాయని చెప్పడానికి వీలుందేమో చూడాలి. ఇదే సమయంలో పాకిస్తాన్‌ పట్ల ప్రభుత్వాల వ్యతి రేకమైన భావనను ప్రజల మనసులలొ బలంగా నాటుకునేలా చేయడంలో సంఘ పరివార్‌ శక్తులు విజయం సాధించాయి. దీన్ని ఎదుర్కోనే ప్రత్యా మ్నాయే సాంస్కృతి కొద్యమం బలంగా లేకపొవ డమే ఈ స్థితికి కారణం.
-కాసుల ప్రతాపరెడ్డి
-వేముల ఎల్లయ్య,స్కైబాబ
ఇంకావుంది…