తెలంగాణ ఆడపడుచులకు సర్కారు సారే 7వ, 25 వార్డులో బతుకమ్మ చీరల పంపిణీ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి

వనపర్తి బ్యూరోఅక్టోబర్ 06 (జనంసాక్షి)

తెలంగాణ ఆడపడుచులకు సర్కార్ తరపున ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరల పేరున సార పంపడం జరుగుతుందని నియోజకవర్గం ఎన్నికల సమన్వయకర్త ప్రమోద్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 7వ , 25 వార్డులకు కలిపి పీర్ల గుట్ట కమ్యూనిటీ హాల్లో కౌన్సిలర్ రాములు యాదవ్, పద్మ రవిల తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్ తో కలిసి వార్డు మహిళలకు బతుకమ్మ చీరలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారి పండుగలకు కానుకలను అందిస్తారని అందులో భాగంగా బతుకమ్మ చీరలను అందిస్తున్నామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని బతుకమ్మ పండుగను కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆయన కోరారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ప్రతి ఆడపరచుకు ఈ సారెను ఇవ్వడం జరుగుతుందని ఆడపడుచుల ఆత్మకూరు పెంచడమే బతుకమ్మ చీరల పంపిణీకి ప్రధాన ఉద్దేశం అని ఆయన వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్క మహేష్, మహిళా సంఘాల అర్పిలు వార్డు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.