తెలంగాణ ఇవ్వకపోతే : మంద , ఇద్దర్ని పిలవడం దురదృష్టకరం : గుత్తా

తెలంగాణ ఇవ్వకపోతే మాకు ఆఫర్లు ఉన్నాయి
పరిశీలిస్తాం : మంద
హైదరాబాద్‌, జనంసాక్షి :
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అను కూలంగా నిర్ణయం తీసుకోకుంటే మాకు ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయని ఎంపీ మందా జగన్నాథం అన్నారు. గురువారం హైదరా బాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తనతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలకు టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఆహ్వానం అందిం దని, అయితే తాము ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోబో మన్నారు. తమ పార్టీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉంద న్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే పార్టీ వీడే విషయమై పునరాలో చించుకుంటామని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయకుంటే తాము తెలంగాణలో తిరగలేమని, పార్టీకి భవిష్యత్‌ ఉండదని సోనియాగాంధీకి చెప్పినట్లు ఆయన వివరించారు. ఈ నెల 28న నిర్వహించనున్న అఖిలపక్షం సమావేశంలో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి తొమ్మిది పార్టీల నాయకులు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరారు. కాగా, మందాజగన్నాథంతో పాటు మరో ముగ్గురు ఎంపీలు ఆయన వెంట నడవనున్నట్లు సమాచారం.

డిసెంబర్‌ ప్రకటనకు కట్టుబడాలి
ఇద్దర్ని పిలవడం దురదృష్టకరం : గుత్తా
నల్గొండ, డిసెంబర్‌ 13 (జనంసాక్షి):
కేంద్ర పభ్రుత్వం 2009 డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం నల్గొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు చేయకపోతే ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌పార్టీకి మనుగడ కష్టమన్నారు. అఖిలపక్షం సమావేశానికి ముందే టీడీపీ, వైఎస్సార్‌ సీపీలు స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కోరారు. హోంమంత్రి షిండే రాసిన లేఖ గందరగోళం సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశానికి ఇద్దరు ప్రతినిధులను పిలవడం సరికాదన్నారు. ఒక్కో ప్రాంతం వారు వేర్వేరు అభిప్రాయాలు చెబితే ఇక ఏకాభిప్రాయానికి తావెక్కడ ఉంటుందని ప్రశ్నించారు. గందరగోళం పరిచే రీతిలో వ్యవహరించడం పార్టీకి మంచిది కాదన్నారు. పార్లమెంటు సభ్యుల వినతి మేరకే సమావేశం ఏర్పాటు చేస్తున్నామని షిండే చెప్పడం విచారకరమన్నారు. లగడపాటి, కావూరి వంటి సీమాంధ్రనేతల వైఖరి సమస్యను మరింత జఠిలం చేస్తుందన్నారు. వీరిరువురు సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండలో రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణలు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని చెప్పారు.