తెలంగాణ ఉత్సవాలకు నగరాలు ముస్తాబు
ప్లాస్టిక్ నిషేధం దిశగా ఏర్పాట్లు
వరంగల్,మే30(జనంసాక్షి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రధాన కూడళ్లలో ¬ర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ సహా జనగామ తదితర ప్రధాన నగరాలను అందంగా అలంకరిస్తున్నారు. సిఎం కెసిఆర్‌తో పాటు, పథకాలను వివరించేలా భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ప్లాస్టిక్ నిషేధానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగించుకుండా చూడాలన్న సంకల్పాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ఇది ఓ ప్రచారంగా సాగితే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు. దీనిపై అవసరమైతే ప్రచారం కూడా చేయాలన్నారు. ప్రజలను ఈ వైపుగా చైతన్యం చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయివరకు నిర్వహించే ఈ ఆవిర్భావ ఉత్సవాలు పండుగ వాతావరణాన్ని తలపింపజేయాలన్నారు. కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు ఆసక్తి ఉన్న వారిని స్వచ్ఛందంగా సేవలందించేందుకు ఆహ్వానించాలన్నారు. పాటలు, నృత్యాలు, నాటకాలు, క్రీడలు వంటి వాటిల్లోనైపుణ్యం ప్రదర్శించే ప్రతీ ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. క్రీడలు నిర్వహించే సమయాలు ముందుగా తెలియ జేయాలన్నారు. అదే విధంగా ఉత్తమ ఉపాధ్యాయులు, ఆదర్శ రైతులు, క్రీడల్లో పతకాలు తెచ్చుకొని జిల్లా కీర్తిని ఇనుమడింపజేసేలా వారిని ఎంపిక చేసి సత్కరించనులన్నారు. స్వచ్ఛందంగా సేవలందిస్తూ సమాజ సేవ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న వారిని కూడా సత్కారాలకు ఎంపిక చేయాలన్నారు. అదే విధంగా చిత్రకారులు, మెజీషియన్లు, మిమిక్రీ ఆర్టిస్ట్‌లను సన్మానించుకోవాలన్నారు. విద్యావంతులు, శాస్త్రవేత్తలను కూడా ఎంపిక చేయాలని నిర్ణయించారు. అధికారులందరూ పాలుపంచుకుని విజయవంతానికి కృషి చేయాలన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర అవతరణ కార్యక్రమాలను అవగాహనతో చేపట్టాలన్నారు. అందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించు కోవాలని సూచించారు. తెలంగాణ వంటకాలపై జిల్లా గ్రావిూణాభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలతో చేపడతామన్నారు.