‘తెలంగాణ ఉద్యమంనుంచి దూరం చేయలేరు’
మెదక్: తెలంగాణ ప్రభుత్వోద్యోగులను తెలంగాణ ఉద్యమం నుంచి ప్రభుత్వం దూరం చేయలేదని తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఉద్యోగులపై ఎన్ని కేసులు బనాయించినా ప్రభుత్వం వారిని ఉద్యమానికి దూరంగా ఉంచలేరని తెలియజేశారు. ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ వ్యక్తం చేశారు. లేకుంటే హైదరాబాద్‌లో ఈనెల 19 నుంచి మహాధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు.