‘తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం అదృష్టం’
ఉద్యోగానికి రాజీనామా చేసిన దేవీప్రసాద్
మెదక్, ఫిబ్రవరి 21: తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. శుక్రవారం సిద్దిపేటలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో తన ఉద్యోగానికి రాజీనా చేస్తూ రిజైన్ లెటర్ ఇచ్చారు. దేవీ ప్రసాద్ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం దేవీప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం అదృష్టం అన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో తనను భాగస్వామిని చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్జీవోలు-ప్రభుత్వానికి మధ్య వారదిగా పనిచేస్తానని చెప్పారు.