తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదల
పశ్చిమ గోదావరి జిల్లా వాసికి తొలి ర్యాంక్
సెప్టెంబర్ 4నుంచి ధృవపత్రాల పరిశీలన
4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు
14న తొలివిడత సీట్ల కేటాయింపు
వివరాలు వెల్లడిరచిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
హైదరాబాద్,అగస్టు25(జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. వీటిని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం విడుదల చేశారు. కరోనా సమయంలో కూడా సమన్వయంతో, ఎలాంటి ఇబ్బంది రాకుండా పరీక్షను నిర్వహించామన్నారు. ఎంసెట్‌ను తొమ్మిది విడుతల్లో నిర్వహించా మని చెప్పారు. గత మూడేండ్లతో పోలిస్తే ఈ ఏడాది 28 వేల మంది విద్యార్థులు అధికంగా పరీక్ష రాశారని చెప్పారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 1,47,991 మంది విద్యార్థులు రాశారని అందులో 1,21,480 మంది క్వాల్గిª అయ్యారని చెప్పారు. అంటే 82.08 శాతం మంది అర్హత సాధించారన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్టీమ్ర్‌లో 79,009 మంది పరీక్ష రాయగా.. 73,070 మంది అర్హత సాధించారని చెప్పారు. అంటే 92.48 శాతం మంది విద్యార్థులు క్వాల్గిª అయ్యారని వెల్లడిరచారు. ఇంజినీరింగ్‌స్ట్రీమ్‌లో మొదటి ర్యాంక్ పశ్చిమ గోదావరికి చెందిన కార్తికేయ, రెండో ర్యాంకును వెంకట నరేష్ (రాజంపేట`కడప), మూడో ర్యాంక్ మహ్మద్ అబ్దుల్ (హైదరాబాద్), నాలుగో ర్యాంక్ రామస్వామి (నల్లగొండ), ఐదో ర్యాంక్ వెంకట ఆదిత్య (కూకట్‌పల్లి) సాధించారని, అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్టీమ్ర్‌లో మొదటి ర్యాంకు మండవ కార్తికేయ (హైదరాబాద్), రెండో ర్యాంకు ఎమాని శ్రీనీజ (రంగారెడ్డి), హైదరాబాద్‌కు చెందిన కౌశల్ రెడ్డి మూడో ర్యాంకు సాధించారు. ఫలితాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల ఎంసెట్ ర్యాంకులను ప్రకటించారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 4, 5, 6 (ఇంజినీరింగ్), 9, 10 తేదీల్లో (వ్యవసాయ, ఫార్మా ఎంసెట్) పరీక్షను నిర్వహించారు. ఇంజినీరింగ్
విభాగానికి 1,47,986 మంది, అగ్రికల్చల్, మెడికల్ స్టీమ్ర్‌కు 91.19 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం 45 శాతం మార్కుల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ మొదటి విడత ఈనెల 30న ప్రారంభమవుతుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తామని, సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవాలని వెల్లడిరచారు. సెప్టెంబర్ 15న మొదటి విడత సీట్లను కేటాయిస్తామని చెప్పారు. మిగిలిన సీట్లను బట్టి రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత వ్యవసాయ, ఫార్మా కోర్సుల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు అధికారులతో పాటు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, మాజీ ఛైర్మన్ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.